వ్యాపారంగా రాజకీయాలు: మల్లు రవి | malluravi fired on trs government | Sakshi
Sakshi News home page

వ్యాపారంగా రాజకీయాలు: మల్లు రవి

Jun 15 2016 2:46 AM | Updated on Mar 18 2019 9:02 PM

వ్యాపారంగా రాజకీయాలు: మల్లు రవి - Sakshi

వ్యాపారంగా రాజకీయాలు: మల్లు రవి

రాష్ట్రంలో రాజకీయాలను వ్యాపారంగా మార్చారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలను వ్యాపారంగా మార్చారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను నయానా భయానా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారన్నారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్లపై ఆరోపణలు చేసిన గుత్తా ఇప్పుడదే టీఆర్‌ఎస్‌లో ఎలా చేరుతున్నారన్నారు. టికెట్ ఇప్పించిన జానారెడ్డికి ఎమ్మెల్యే భాస్కర్‌రావు వెన్నుపోటు పొడిచారన్నారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌లో పనిచేసిన వెంకట స్వామి ఆత్మ క్షోభించేలా తనయులు వివేక్, వినోద్ పార్టీ మారుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement