ఆ ప్రాజెక్టులు మా ప్రభుత్వం చేపట్టినవే | mahaboobnagar projects all are my government cunstructioned :ravula | Sakshi
Sakshi News home page

ఆ ప్రాజెక్టులు మా ప్రభుత్వం చేపట్టినవే

Jul 22 2016 2:56 AM | Updated on Sep 4 2017 5:41 AM

ఆ ప్రాజెక్టులు మా ప్రభుత్వం చేపట్టినవే

ఆ ప్రాజెక్టులు మా ప్రభుత్వం చేపట్టినవే

మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు టీడీపీ హయాం లో చేపట్టినవేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి

టీడీపీ నేత రావుల
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు టీడీపీ హయాం లో చేపట్టినవేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.ఈ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు గతంలో ప్రారంభించిన వాటినే మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డితో కలసి ఆయన ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మోటార్లు బిగించి జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా పైలాన్‌లు నిర్మించి మళ్లీ ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వొచ్చని ఎప్పుడో ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ప్రతిపాదించి  అంతర్రాష్ట్ర జల వివాదాల్లోకి లాగారని దయాకర్‌రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement