లైన్ క్లియర్ | Line Clear | Sakshi
Sakshi News home page

లైన్ క్లియర్

Jan 7 2014 4:16 AM | Updated on Sep 2 2017 2:21 AM

/నగర పంచాయతీలు రానున్నాయి. 35 గ్రామ పంచాయతీలను ప్రతిపాదిత 12 పురపాలక సంఘాల పరిధిలోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది.

=మున్సిపాలిటీల ఫైలుపై మంత్రి మహీధర్ సంతకం
=35 పంచాయతీలను డీనోటిఫై చేయాలని పీఆర్‌కు లేఖ
=నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి

 
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ శివార్లలో కొత్త మునిసిపాలిటీలు/నగర పంచాయతీలు రానున్నాయి. 35 గ్రామ పంచాయతీలను ప్రతిపాదిత 12 పురపాలక సంఘాల పరిధిలోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన గ్రామపంచాయతీలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో ప్రభుత్వం... వాటిని గ్రేటర్‌లో కలిపే అంశంలో వెనక్కి తగ్గింది.

ఈ నేపథ్యంలోనే మణికొండ జాగీర్, గుండ్లపోచంపల్లి, కాల్వంచ గ్రామాలు మినహా.. మిగతావాటిని మున్సిపాలిటీలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై పురపాలకశాఖ మంత్రి మహీధర్‌రెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు. మున్సిపల్ శాఖలో విలీనం చేసుకుంటున్న గ్రామాలను డీనోటిఫై చేయాలని సూచిస్తూ పంచాయతీరాజ్ శాఖకు ఫైలు పంపారు. అక్కడి నుంచి ఫైలు ముఖ్యమంత్రి దరికి చేరనుంది. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి... శివారు పంచాయతీలు కాస్తా మున్సిపాలిటీలుగా/నగర పంచాయతీలుగా మారనున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరు లోపు పూర్తయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.
 
కొత్త మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలివే:  శంషాబాద్, నార్సింగి, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, కొంపల్లి, జిల్లెలగూడ, మీర్‌పేట, కొత్తపేట, జల్‌పల్లి, బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం
 

Advertisement
 
Advertisement
Advertisement