రాజ్భవన్లో గవర్నర్తో కేసీఆర్ భేటీ | KCR to meet governor narasimhan at Rajbhavan | Sakshi
Sakshi News home page

రాజ్భవన్లో గవర్నర్తో కేసీఆర్ భేటీ

Aug 3 2016 4:46 PM | Updated on Aug 15 2018 9:35 PM

రాజ్భవన్లో గవర్నర్తో కేసీఆర్ భేటీ - Sakshi

రాజ్భవన్లో గవర్నర్తో కేసీఆర్ భేటీ

రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో బుధవారం రాజ్భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆగస్టు 7వ తేదీన జరిగే మెదక్ జిల్లా గజ్వేల్ లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించనున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు అదే రోజున నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై గవర్నర్తో కేసీఆర్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.

కాగా, ప్రధాని పర్యటనలో భాగంగా తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను వరంగల్‌లో నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.  అదేవిధంగా హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొనే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement