పోలీస్ శాఖపై కేసీఆర్ వరాల జల్లులు | kcr review meeting with officials in Camp Office | Sakshi
Sakshi News home page

పోలీస్ శాఖపై కేసీఆర్ వరాల జల్లులు

Feb 5 2016 2:25 PM | Updated on Aug 21 2018 8:41 PM

పోలీస్ శాఖపై కేసీఆర్ వరాల జల్లులు - Sakshi

పోలీస్ శాఖపై కేసీఆర్ వరాల జల్లులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖలోని నిఘా విభాగం, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లోని ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖలోని నిఘా విభాగం, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లోని ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయా విభాగాల ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లోని ఉద్యోగులకు మూలవేతనంపై 25 శాతం అలవెన్స్ ప్రకటించినట్లు వెల్లడించారు.

ఇంటెలిజెన్స్ విభాగంలో 464  మందికి, సెక్యూరిటీ విభాగంలో 893 మందికి, సీఐడీ విభాగంలో 646 మంది ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగంగా జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు అదనంగా.. మరో రెండు ప్రభుత్వాస్పత్రులను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బొగ్గుగని కార్మికులకు మెరుగైన వైద్యం కోసం కోల్ బెల్ట్లో కూగీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు కేసీఆర్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement