బీజేపీది పగటి కల: కర్నె ప్రభాకర్‌ | Karney Prabhakar commented over BJP | Sakshi
Sakshi News home page

బీజేపీది పగటి కల: కర్నె ప్రభాకర్‌

Sep 20 2017 2:57 AM | Updated on Sep 20 2017 11:51 AM

బీజేపీది పగటి కల: కర్నె ప్రభాకర్‌

బీజేపీది పగటి కల: కర్నె ప్రభాకర్‌

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పగటి కలేనని, టూలెట్‌ బోర్డు పెట్టుకుని

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పగటి కలేనని, టూలెట్‌ బోర్డు పెట్టుకుని ఎదురుచూస్తున్నా ఆ పార్టీలో ఎవరూ చేరరని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశలో కర్నె అన్నారు.

ఏ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుందో కూడా తెలియకుండా అవగాహన లేమితో రాంమాధవ్‌ మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీ కూడా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే వారి వ్యాఖ్యలను ఆయన వక్రీకరిస్తున్నా రన్నారు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement