'అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరాను' | I joined in trs for development, says rajender reddy | Sakshi
Sakshi News home page

'అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరాను'

Feb 16 2016 9:46 PM | Updated on Aug 15 2018 9:30 PM

'అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరాను' - Sakshi

'అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరాను'

తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌: తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నారాయణపేట చాలా వెనుకబడి ఉందని వివరించారు. అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారని, అందుకే టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి రాజేందర్ ను టీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్‌ ఆహ్వానించారు. టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో అధికారకంగా చేరనున్నట్లు సమచారం. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, నారాయణఖేడ్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన టీఆర్‌ఎస్‌.. వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జరిగే పురపాలక ఎన్నికలపై దృష్టి సారిస్తూ వడిగా అడుగులు వేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement