కూకట్‌పల్లిలో భారీ దొంగతనం | ​huge robbery in kukatpalli | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో భారీ దొంగతనం

Apr 27 2017 2:17 PM | Updated on Sep 5 2017 9:50 AM

కూకట్‌పల్లి ఈనాడు కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్‌: కూకట్‌పల్లి ఈనాడు కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముక్తా నివాస్‌లోని ఫ్లాట్ నంబర్-403 యజమాని కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇదే అదనుగా భావించిన దుండగులు బుధవారం అర్థరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న దాదాపు 45 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి సామగ్రితో పాటు, ఒక లక్ష నగదును ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం గమనించిన పొరుగు ప్లాట్‌ వారు బాధితులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement