మరో మూడు రోజులపాటు వడగాలులు | High temperatures in Two telugu states | Sakshi
Sakshi News home page

మరో మూడు రోజులపాటు వడగాలులు

Apr 14 2016 4:27 PM | Updated on Sep 3 2017 9:55 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకి మరింత ఎక్కువవుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకి మరింత ఎక్కువవుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఏపీ, తెలంగాణలలో వడగాలులకు ఇప్పటివరకు 150మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో మూడు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో గురువారం 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక మిగిలిన జిల్లాల్లో 40డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement