యజమాని కళ్లుగప్పి బంగారం చోరీ | gold robbery in jewellery shop | Sakshi
Sakshi News home page

యజమాని కళ్లుగప్పి బంగారం చోరీ

Jun 3 2016 7:34 PM | Updated on Sep 4 2017 1:35 AM

నగంరలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రా జ్యువెల్లరీ దుకాణంలో శుక్రవారం చోరీ జరిగింది.

హైదరాబాద్‌: నగంరలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రా జ్యువెల్లరీ దుకాణంలో శుక్రవారం చోరీ జరిగింది. ఓ వ్యక్తి నగల షాపు యజమాని దృష్టి మరల్చి బంగారు గొలుసును తస్కరించాడు. చోరీ చేసిన బంగారు గొలుసు స్థానంలో బంగారుపూత పూసిన మరో చైన్‌ను అక్కడ ఉంచాడు. అనంతరం అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. సదరు వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత నగల దుకాణం యజమాని విషయం తెలుసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తి గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement