బురిడీ బాబాకు ఐదురోజుల కస్టడీ | five-day police custody to Baba | Sakshi
Sakshi News home page

బురిడీ బాబాకు ఐదురోజుల కస్టడీ

Jun 24 2016 10:03 AM | Updated on Aug 21 2018 7:17 PM

బురిడీ బాబా శివానందను విచారణ జరిపేందుకు నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది.

డబ్బులు రెండింతలు చేస్తానని నమ్మించి లైఫ్ స్టైల్ యజమాని మధుసూధన్‌రెడ్డిని బురిడీ కొట్టించిన బురిడీ బాబా శివానందను విచారణ జరిపేందుకు నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. పూజల పేరిట మధుసూధన్‌రెడ్డి వద్ద నుంచి రూ. 1.33 కోట్లతో ఉడాయించిన బుడ్డప్పగారి శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు శివను పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో.. సమ్మతించిన కోర్టు బురిడీ బాబాను ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement