శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం తప్పింది.
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌లో పంపించేందుకు ఓ ఏజెంట్ కార్గో ఏరియాకు తీసుకువచ్చిన కెమికల్స్ బాక్సు నుంచి పొగలు వెలువడ్డాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
కెమికల్ బాక్సులను అక్కడి నుంచి వెంటనే దూరంగా తరలించారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ విషయమై భద్రత అధికారులు దర్యాప్తు చేపట్టారు.