నకిలీ ఐటీ అధికారుల ముఠా అరెస్ట్ | fake income tax officers gang arrest | Sakshi
Sakshi News home page

నకిలీ ఐటీ అధికారుల ముఠా అరెస్ట్

Dec 4 2016 2:16 PM | Updated on Sep 27 2018 4:47 PM

ఐటీ అధికారులమని చెప్పి.. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు

హైదరాబాద్: ఐటీ అధికారులమని చెప్పి.. ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వికారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నోట్లను మార్చుకోవడానికి నగరానికి వస్తుండగా.. ‘ఎర్రబుగ్గ’ కారులో వచ్చిన ఓ ముఠా.. ఐటీ అధికరారులమని చెప్పి.. రూ. 9.2 లక్షల నగదుతో ఉడాయించారు. ఆలస్యంగా తేరుకున్న బాధితుడు లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ ఐటీ అధికారుల ముఠాను ఆదివారం అరెస్ట్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement