రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి | engineering student died in an accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Feb 13 2015 2:31 PM | Updated on Nov 9 2018 5:02 PM

హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

కుత్బుల్లాపూర్(హైదరాబాద్): హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు అఖిల్, శశాంక్, వేణు బైక్‌పై వెళుతుండగా మహారాష్ట్రకు చెందిన ఓ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. అఖిల్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన శశాంక్, వేణును స్థానిక బాలాజీ ఆస్పత్రికి తరలించారు. కాగా, అఖిల్ సికింద్రాబాద్ వాసిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement