డ్రంకన్ డ్రైవ్లో ఎనిమిది కేసులు | eight cases booked by drunk and drive case | Sakshi
Sakshi News home page

డ్రంకన్ డ్రైవ్లో ఎనిమిది కేసులు

May 27 2015 5:36 PM | Updated on Sep 26 2018 3:36 PM

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెట్టేందుకు ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో ఎనిమిది కేసులను నమోదు చేశారు.

రంగారెడ్డి: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెట్టేందుకు ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో ఎనిమిది కేసులను నమోదు చేశారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ పుష్పా దేశ్‌ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిచి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.  మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి రూ.2 వేల జరిమానా విధించారు. అదేవిధంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి రెండు రోజుల జైలుశిక్ష విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement