జూనియర్ డాక్టర్ల సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. రూరల్ సర్వీస్పై మెడికల్ కౌన్సెలింగ్ను అడ్డుకునేందుకు జూనియర్ డాక్టర్లు బుధవారం యత్నించారు.
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. రూరల్ సర్వీస్పై మెడికల్ కౌన్సెలింగ్ను అడ్డుకునేందుకు జూనియర్ డాక్టర్లు బుధవారం యత్నించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, జూనియర్ డాక్టర్లకు వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు ముందస్తుగా పలువురు జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో కోఠి వైద్య విద్యా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా పీజీ వైద్యులు రూరల్ సర్వీస్ చేయాలనే ప్రతిపాదనను తొలగించాలని ఉస్మానియా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తూ అత్యవసర సేవల మినహా అన్ని సేవలు బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.