కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
Feb 16 2017 12:24 PM | Updated on Jul 10 2019 8:00 PM
	హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం భార్య మృతిచెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని రాజేంద్రనరగ్ ఉప్పరపల్లిలో నివాసముంటున్న లక్ష్మణ్, కవిత దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వీరి మధ్య మరోసారి గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురై ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం కవిత మృతి చెందింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
