ప్రారంభమైన కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష | Constable posts exam started over 153 exam centers Telangana state wide | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష

Oct 23 2016 10:53 AM | Updated on Mar 19 2019 5:52 PM

ప్రారంభమైన కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష - Sakshi

ప్రారంభమైన కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష

తెలంగాణలో కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష ప్రారంభమైంది.

హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష జరుగనుంది. మొత్తం 9,281 పోస్టుల కోసం తెలంగాణ వ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పోలీసు కానిస్టేబుల్ (సివిల్/ ఏఆర్/ ఎస్‌ఏఆర్/ టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. అభ్యర్థులు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతోపాటు హాల్ టికెట్‌తో హాజరు కావాలని అధికారులు సూచించిన సంగతి విధితమే.
 

Advertisement
 
Advertisement
Advertisement