ఉన్నత విద్య ప్రక్షాళన | CM Chandrababu comments on Higher education | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య ప్రక్షాళన

Mar 31 2016 2:33 AM | Updated on Apr 7 2019 3:35 PM

ఉన్నత విద్య ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఉన్నత విద్యపై జరిగిన చర్చకు సీఎం బుధవారం శాసనమండలిలో సమాధానం ఇచ్చారు.

మండలిలో సీఎం చంద్రబాబు

 సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఉన్నత విద్యపై జరిగిన చర్చకు సీఎం బుధవారం శాసనమండలిలో సమాధానం ఇచ్చారు. యూనివర్సిటీల్లో ఏ హాస్టళ్లలో చూసినా విద్యార్థులు కులాల బోర్డులు ఏర్పాటు చేసుకున్నారని, విద్యాలయాల్లో అలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం దౌర్భాగ్యమన్నారు.

వర్సిటీల్లో నాన్ బోర్డర్లను ఖాళీ చేయించేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొన్ని యూనివర్సిటీలు ప్రామాణికాలు పాటించడం లేదని చెప్పారు. వర్సిటీల్లో ప్రమాణాలు పెంపునకు 1,100 ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement