పోలీసు అధికారులతో ముగిసిన దత్తాత్రేయ భేటీ | Central govt trying to kill terrorism, says Bandaru dattatreya | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులతో ముగిసిన దత్తాత్రేయ భేటీ

Jul 3 2016 7:26 PM | Updated on Aug 21 2018 7:26 PM

పోలీస్‌ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమావేశం ముగిసింది.

హైదరాబాద్‌:  పోలీస్‌ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ ముగిసింది. పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం దత్తాత్రేయ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ శాంతి భద్రతలపై పోలీసు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐసిస్‌ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ వెల్లడించారు.  ఈ సమావేశానికి అడిషనల్‌ డీజీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ ఈస్ట్‌, వెస్ట్‌ కమిషనర్లు.. మహేశ్‌ భగవత్‌, నవీనచంద్‌, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ త్రివేది తదితరులు హాజరయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement