భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలి | CBI should investigate the land scam | Sakshi
Sakshi News home page

భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలి

Jun 2 2017 3:36 AM | Updated on Mar 29 2019 9:31 PM

భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలి - Sakshi

భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలి

తెలంగాణలోనే అతి పెద్ద భూ కుంభకోణం ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఆరోపించారు.

బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు 
 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోనే అతి పెద్ద భూ కుంభకోణం ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఆరోపించారు. ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యమైన మంత్రులకు ప్రమేయం ఉందని అన్నారు. అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మియాపూర్‌ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ప్రమేయం ఉందని ప్రతికల్లో వార్తలు వస్తున్నా యన్నారు. ఈ కుంభకోణంతో కేసీఆర్‌కు సంబంధం లేకపోతే వెంటనే మహమూద్‌ అలీని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కుంభకోణంలో ఒక్క ఐఏఎస్‌ అధికారిని కూడా ఎందుకు బాధ్యుడిని చేయలేదని నిలదీశారు.  

Advertisement
 
Advertisement
Advertisement