ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు | Boyfriend slit lover's throat in Hyderabad - Mumbai highway | Sakshi
Sakshi News home page

ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు

Dec 4 2014 9:17 PM | Updated on Mar 28 2018 11:11 AM

ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు - Sakshi

ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు

హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారిపై గురువారం దారుణం చోటు చేసుకుంది. దినేష్ అనే వ్యక్తి తన ప్రియురాలి గొంతు కోశాడు.

హైదరాబాద్: హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారిపై గురువారం దారుణం చోటు చేసుకుంది. దినేష్ అనే వ్యక్తి తన ప్రియురాలి గొంతు కోశాడు. దీంతో అమె రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. దాంతో దినేష్ అక్కడి నుంచి పరారవుతుండగా..  స్థానికులు వెంటనే స్పందించి అతడిని పట్టుకుని... దేహశుద్ధి చేశారు.  అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నిందితుడు దినేష్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దినేష్ గుంటూరు జిల్లా తెనాలిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement