'కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారు' | BJP Lleaders takes on trs govt | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారు'

May 17 2016 3:07 PM | Updated on Aug 11 2018 7:03 PM

రాష్ట్రంలో కరవును నివారించేందుకు కేంద్రం నిధులను ఇచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఖర్చు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరవును నివారించేందుకు కేంద్రం నిధులను ఇచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఖర్చు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి ఆరోపించారు. ఈ అంశంలో మహారాష్ట్ర సర్కార్ను చూసి నేర్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు కిషన్రెడ్డి సూచించారు.

తెలంగాణలో కరవుపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ మంగళవారం బీజేపీ నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్, జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ మాట్లాడుతూ... కరవుతో రైతులు చనిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని విమర్శించారు. కేంద్రం ముందు కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement