'మజ్లిస్‌ను నెత్తిన ఎత్తుకున్నారు' | bjp leader slams trs government of telangana liberation day | Sakshi
Sakshi News home page

'మజ్లిస్‌ను నెత్తిన ఎత్తుకున్నారు'

Sep 1 2017 12:46 PM | Updated on Sep 12 2017 1:34 AM

సీఎం కేసీఆర్‌ మజ్లిస్‌ చేతిలో కీలుబొమ్మగా మారారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌: విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ నేత  కె.లక్ష్మణ్‌ యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. విమోచన యాత్ర నేపథ్యంలో బషీర్‌బాగ్లోని కనకదుర్గ అమ్మ వారికి లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డిలు ప్రత్యేక పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్‌తో కలిసి కేసీఆర్‌ విమోచన దినం నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన మజ్లిస్‌ను నెత్తిన ఎత్తుకుని కేసీఆర్ ఉరేగుతున్నారన్నారు. లక్ష్మణ్‌ చేపడుతున్న తెలంగాణ విమోచన యాత్రకు అందరు కలిసిరావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.      

Advertisement
 
Advertisement
Advertisement