బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి | beautician suspicious suicide death in hyderabad | Sakshi
Sakshi News home page

బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

Jun 14 2017 7:58 AM | Updated on Sep 5 2017 1:37 PM

బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ బ్యూటీషియన్‌ మృతిచెందింది.

బంజారాహిల్స్‌: అనుమానాస్పద స్థితిలో ఓ  బ్యూటీషియన్‌ మృతిచెందింది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్‌ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నది. సోమవారం రాత్రి 8–40 గంటలకు తన భర్త సతీష్‌చంద్రకు ఫోన్‌చేసి తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది. అయితే రాత్రికి ఆమె ఇంటికి రాలేదు. ఎప్పటిలాగానే సతీష్‌ మంగళవారం ఉదయం బేగంపేటలోని తాను కుక్‌గా పనిచేసే ఆశ్రయ్‌–ఆకృతి పాఠశాలకు వెళ్ళారు.

తరువాత సతీష్‌చంద్రకు బంజారాహిల్స్‌ పోలీసులు ఫోన్‌చేసి ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రావాలని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూడగా మంచంపైన భార్య శిరీష మృతదేహం కనిపించింది. యజమాని వల్లభనేని రాజీవ్‌ను ఏమైందని ప్రశ్నించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే  చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని తెలిపారు. తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదుచేశారు. ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరికి 12 సంవత్సరాల కూతురు ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement