బీటెక్ విద్యార్థిని అదృశ్యం | B.Tech student missing | Sakshi
Sakshi News home page

బీటెక్ విద్యార్థిని అదృశ్యం

Jun 12 2016 7:04 PM | Updated on Sep 4 2017 2:20 AM

విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్‌ : విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ మోహన్ కథనం ప్రకారం.. జేఎల్‌ఎస్‌ నగర్‌కు చెందిన కృష్ణగౌడ్ కుమార్తె ఉషారాణి (22) సీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ నాలుగో  సంవత్సరం చదువుతోంది. ఈ నెల 10న కాలేజీకి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సెల్‌ఫోన్ స్విచ్‌ ఆఫ్ వస్తుండడంతో ఆచూకీ కూడా తెలియలేదు. ఆదివారం విద్యార్థిని తండ్రి కృష్ణగౌడ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement