గ్యాంగ్ రేప్ .. ఆపై బెదిరింపులు | Atrocity in Hyderabad | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్ .. ఆపై బెదిరింపులు

May 30 2016 12:57 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు బెదిరించి రూ.లక్షల్లో వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- హైదరాబాద్ లో దారుణం
హైదరాబాద్

ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు బెదిరించి రూ.లక్షల్లో వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్ జసీం షరీఫ్ ఖాన్, సయ్యద్ ఇమ్రాన్ మరికొందరు కలసి ఇటీవల ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె ఫొటోలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వాటిని చూపి బాధితురాలిని బెదిరిస్తూ నగలు, నగదు కలిసి రూ.30 లక్షల వరకు వసూలు చేశారు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితులైన అహ్మద్ జసీం షరీఫ్ ఖాన్, సయ్యద్ ఇమ్రాన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement