ఏపీ హెచ్‌ఆర్‌డీ కార్యాలయం బాపట్లకు | AP HRD office to Bapatla | Sakshi
Sakshi News home page

ఏపీ హెచ్‌ఆర్‌డీ కార్యాలయం బాపట్లకు

Apr 25 2016 2:33 AM | Updated on Sep 3 2017 10:39 PM

ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీ హెచ్‌ఆర్‌డీ) కార్యాలయాన్ని బాపట్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీ హెచ్‌ఆర్‌డీ) కార్యాలయాన్ని బాపట్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతున్న ఈ కార్యాలయాన్ని బాపట్లకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బాపట్లలోని పంచాయతీరాజ్ ఈటీసీ సెంటర్‌లో దీనిని ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతం అక్కడ ఉన్న భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి, అనంతరం శాశ్వత భవనాల నిర్మాణం చేపడతామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పంచాయతీరాజ్ సంస్థల ప్రజా ప్రతినిధుల శిక్షణకు సంబంధించిన అపార్డు కార్యాలయాన్ని కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement