అగ్రిగోల్డ్‌ కేసు.. సీఐడీ అదుపులో మరో ముగ్గురు | Another three accused agrigold persons send to remand for 14 days | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ కేసు.. సీఐడీ అదుపులో మరో ముగ్గురు

Feb 18 2016 4:27 PM | Updated on Mar 28 2019 5:27 PM

అగ్రిగోల్డ్‌ కేసులో మరో ముగ్గుర్ని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది.

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కేసులో మరో ముగ్గుర్ని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. గురువారం ముగ్గురు నిందితులను ఏలూరు కోర్టులో సీఐడి అధికారులు హాజరు పర్చారు. నిందితులకు అక్కడి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అయితే నిందితులను 4 రోజుల కస్టడీకి సీఐడీ కోరినట్టు తెలిసింది.

అరెస్టైన వారిలో అగ్రిగోల్డ్‌ ఫార్మా వైఎస్‌ ఛైర్మన్‌ సదాశివవరప్రసాద్‌, అగ్రిగోల్డ్‌ కనస్ట్రక్షన్స్‌ ఎండీ రామచంద్రరావు, డ్రీమ్‌ల్యాండ్‌ వెంచర్స్‌ ఎండీ అహ్మద్‌ఖాన్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement