యూపీ ముఠా వద్ద రెండు తుపాకులు స్వాధీనం | two guns seized at UP gang | Sakshi
Sakshi News home page

యూపీ ముఠా వద్ద రెండు తుపాకులు స్వాధీనం

Apr 10 2016 9:08 AM | Updated on Aug 25 2018 4:26 PM

మెదక్ లో ఘర్షణ పడుతున్న యూపీ ముఠా నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

మెదక్ జిల్లా నంగునూరు మండలం రాంపూర్ చౌరస్తా వద్ద శనివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని తనిఖీ చేయగా.. వారి వద్ద 2 పిస్తోళ్లు, ఓ తపంచా లభించాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు గొడివపడుతున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. దీంతో వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా.. ఇద్దరు చిక్కారు. మరో ముగ్గురు పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని పోలీసులు సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అదుపులో తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement