విశాఖలో ప్రైవేటు బస్సు బీభత్సం | The private bus havoc in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ప్రైవేటు బస్సు బీభత్సం

Dec 27 2015 10:38 AM | Updated on Apr 3 2019 7:53 PM

విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో బ్రేకులు ఫెయిలై ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది.

విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో బ్రేకులు ఫెయిలై ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం నర్సింహనగర్ నుంచి హైవేకు వెళుతున్న ఆదిత్య టూర్స్ ట్రావెల్స్ మినీ బస్సు ఎదురుగా వచ్చిన బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. అదే క్రమంలో నడచి వెళుతున్న వారిపైకి కూడా దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. రవాణాశాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 

Advertisement
 
Advertisement
Advertisement