బస్సు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి | software engineer died due to accident | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

Oct 31 2015 11:47 AM | Updated on Apr 3 2019 7:53 PM

నగరంలోని చింతల్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని చింతల్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ  ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. వివరాలు..  చింతల్ ఐడీపీఎల్ చౌరస్తాలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. చింతల్‌లో నివాసం ఉండే రాంబాబు హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

శనివారం ఉదయం బైక్‌పై హైటెక్‌సిటీకి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement