విజయవాడలో బంగారు అభరణాల తయారీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
విజయవాడ: విజయవాడ నగరంలో ఓ బంగారు అభరణాల తయారీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బెంగళూరులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ తర్వాత పోలీసులు వెంబడించడంతో దొంగలు పరారైన సంగతి తెల్సిందే. కాల్ డేటా ఆధారంగా ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. నిందితులు యూపీ, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. జైలులో ఏర్పడిన పరిచయంతో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు సమాచరం.