'పోలీస్ శాఖ అవినీతికి నిలయంగా మారింది' | Katakam Mruthyunjayam takes on telangana police department | Sakshi
Sakshi News home page

'పోలీస్ శాఖ అవినీతికి నిలయంగా మారింది'

Dec 1 2015 12:56 PM | Updated on Aug 20 2018 5:11 PM

'పోలీస్ శాఖ అవినీతికి నిలయంగా మారింది' - Sakshi

'పోలీస్ శాఖ అవినీతికి నిలయంగా మారింది'

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు డిపార్ట్మెంట్ అవినీతికి నిలయంగా మారిందని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం ఆరోపించారు.

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో పోలీసు డిపార్ట్మెంట్ అవినీతికి నిలయంగా మారిందని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో మృత్యుంజయం విలేకర్లతో మాట్లాడారు. ఏఎస్సై మోహన్రెడ్డి ఉదంతమే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మోహన్రెడ్డి అక్రమ దందాకు కారకులైన పోలీసు ఉన్నతాధికారులపై సూమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ( సిట్ ) ఏర్పాటు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో జిల్లాలో మావోయిస్టులకు సహకరించిన వేలాది మందిపై అనేక కేసులు పెట్టి పోలీసులు వేధించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరని కేసీఆర్ ప్రభుత్వాన్ని కె. మృత్యుంజయం ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement