breaking news
karimnagar dcc president
-
'పోలీస్ శాఖ అవినీతికి నిలయంగా మారింది'
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో పోలీసు డిపార్ట్మెంట్ అవినీతికి నిలయంగా మారిందని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో మృత్యుంజయం విలేకర్లతో మాట్లాడారు. ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతమే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మోహన్‌రెడ్డి అక్రమ దందాకు కారకులైన పోలీసు ఉన్నతాధికారులపై సూమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ( సిట్ ) ఏర్పాటు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో జిల్లాలో మావోయిస్టులకు సహకరించిన వేలాది మందిపై అనేక కేసులు పెట్టి పోలీసులు వేధించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరని కేసీఆర్ ప్రభుత్వాన్ని కె. మృత్యుంజయం ప్రశ్నించారు. -
కేసీఆర్‌ను అధికారులు చీటింగ్ చేస్తే...
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అధికారులు చీటింగ్ చేస్తే... ప్రజలను కేసీఆర్ చీటింగ్ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం ఆరోపించారు. గోదావరి పుష్కరాలు నేపథ్యంలో జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరంలోని జరుగుతున్న పుష్కర పనులను మృత్యుంజయంతోపాటు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం కె. మృత్యుంజయం కరీంనగర్లో మాట్లాడారు. ధర్మపురిలో పుష్కర పనులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మురుగునీటిలో స్నానాలు చేసేలా ఏర్పాటు చేయడం ఆయన విచారం వ్యక్తం చేశారు. అస్తవ్యస్థ పుష్కర ఏర్పాట్లపై గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని కె.మృత్యుంజయం వెల్లడించారు.