
వాటర్ టబ్బులో ముంచి చంపిన వైనం
సౌదీలో హైదరాబాదీ మహిళ ఘాతుకం
గోల్కొండ: ఓ మహిళ తన ముగ్గురు కొడుకులను కడతేర్చిన సంఘటన సౌదీ అరేబియాలోని అల్‌కోబర్ నగరంలో చోటు చేసుకుంది. నిందితురాలు హైదరాబాద్ నగరానికి చెందినది కావడం గమనార్హం. వివరా లు ఇలా ఉన్నాయి... టోలిచౌకీకి చెందిన సయ్యదా ఉమేరా అమ్రీన్ భర్త సౌదీ అరేబియాలోని అల్‌కోబర్‌లో పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం సయ్యదా ఉమేరా అమ్రీన్ తన ముగ్గురు కుమారులతో భర్త వద్దకు వెళ్లింది.
మంగళవారం రాత్రి ఆమె తన కుమారులు యూసుఫ్ అహ్మద్(3), మహ్మద్ సాదిక్ అహ్మద్(6), మహ్మద్ ఆదిల్ అహ్మద్(6) ఇంట్లోని వాటర్ టబ్బులో ముంచి చంపేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ఆత్మహత్యకు యతి్నంచింది. దీనిని గుర్తించిన ఆమె భర్త మహ్మద్ షానవాజ్ లేచి అమ్రీన్‌ను రక్షించాడు. బుధవారం ఉదయం స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు అమ్రీన్‌ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. కాగా ఆమెకు గత కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేనట్లు తెలిసింది.