
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలో దారుణం జరిగింది. వృద్దురాలిని కత్తితో దాడి చేసిన దండుగులు బంగారు అభరణాలను అపహరించారు. బుర్ఖాలో వచ్చి వృద్దురాలు ఇందిరమ్మపై దాడి చేశారు. వృద్ధురాలు ప్రతి ఘటించడంతో మహిళ కత్తితో దాడి చేసింది. గాయాలైన వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.