
కర్ణాటక: మహిళా ఐటీ ఇంజినీరు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. ఎస్‌జె పాళ్యలో నివాసం ఉంటున్న శిల్ప (26) ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త ప్రవీణ్ చెబుతున్నాడు. సుద్దగుంటపాళ్యలోని నివాసంలో ఆమె ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. శిల్పాను ప్రవీణ్ కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రవీణ్ వేధింపులు, చిత్రహింసలు కారణంగా ఇలా జరిగిందని వారు విలపించారు. శిల్ప ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ప్రవీణ్ పానీపూరి వ్యాపారం చేసేవాడని, అనుమానంతో నిత్యం వేధించేవాడని చెప్పారు. పెళ్లి సంబంధం సమయంలో తాను ఐటీ ఇంజినీరని అబద్ధాలు చెప్పాడని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా భర్త ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.