శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | hyderabad mayor bonthu rammohan visit tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Apr 4 2016 12:05 PM | Updated on Sep 3 2017 9:12 PM

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సోమవారం దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు  సోమవారం దర్శించుకున్నారు.  హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబసమేతంగా వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు.  అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, చాముండేశ్వరి నాథ్ లు కూడా ఏడుకొండలవాడి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement