ఈద్గాలో తేనెటీగల దాడి.. 40 మందికి గాయాలు | honey bees attack in Eidgah prayers | Sakshi
Sakshi News home page

ఈద్గాలో తేనెటీగల దాడి.. 40 మందికి గాయాలు

Sep 25 2015 10:33 AM | Updated on Sep 3 2017 9:58 AM

ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ఈద్గాలో ప్రార్థనల సందర్భంగా ముస్లింలపై తేనెటీగలు దాడి చేశాయి.

నెన్నెల: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ఈద్గాలో ప్రార్థనల సందర్భంగా ముస్లింలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 మందికి గాయాలు కాగా, వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బక్రీద్ సందర్భంగా సుమారు 150 మంది ముస్లింలు ఈద్గా వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడున్న మర్రిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. గాయపడ్డ వారిలో ఇబ్రహీం, మోహిన్, డప్పులు వాయించాడనికి వచ్చిన లింగంపల్లి శంకర్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడగా..వారిని 108 వాహనంలో బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు

Advertisement
 
Advertisement
Advertisement