వడ్డీ వ్యాపారి దాడి: వ్యక్తికి తీవ్రగాయాలు | Financiar attacked in nacharam | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారి దాడి: వ్యక్తికి తీవ్రగాయాలు

Feb 15 2016 11:00 AM | Updated on Oct 2 2018 4:31 PM

నగరంలోని నాచారంలో ఓ వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

హైదారాబాద్: నగరంలోని నాచారంలో ఓ వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటన  ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బంగారు నగల వ్యాపారి గిరి వ్యాపార నిమిత్తం కుమార్ అనే వ్యక్తి నుంచి రూ. 30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రస్తుతం రూ. కోటి ఇవ్వాలని కుమార్ డిమాండ్ చేయడంతో.. ఇద్దిరి మధ్య వివాదం చోటు చేసుకుంది.  వ్యాపారి నుంచి తీసుకున్న అప్పుకు మూడింతలు వడ్డీ వసులు చేస్తుండటంతో గిరి నిలదీశాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కుమార్ గిరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement