రీకాకుళం జిల్లా కొత్తూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో పదోతరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు డిప్తీరియా (కోరింత దగ్గు) బారినపడి మృతిచెందాడు.
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో పదోతరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు డిప్తీరియా (కోరింత దగ్గు) బారినపడి మృతిచెందిన సంఘటన స్థానికంగా కలకలంరేపింది. బామిని మండలం నేరడికి చెందిన బి. నరేష్ (15).. కొత్తూరులోని గురుకుల హాస్టల్ లో పదోతరగతి చదువుతున్నాడు.
గడిచిన పదిరోజులుగా కోరింత దగ్గుతో బాధపడుతున్నప్పటికీ విద్యార్తిని సిబ్బంది పట్టించుకోలేదని తెలిసింది. శనివారం నాటికి పరిస్థితి విషమించడంతో నరేశ్ ను విశాఖపట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతిచెందాడు. విద్యార్థి మృతితో అతడి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.