కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు | Ayutha chandi yagam work progress in kcr farmhouse | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు

Dec 3 2015 5:49 PM | Updated on Aug 16 2018 1:18 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్లో జరగనున్న ఆయుత చండీయాగానికి సంబంధించిన పనులు చకచక సాగుతున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్లో జరగనున్న ఆయుత చండీయాగానికి సంబంధించిన పనులు చకచక సాగుతున్నాయి. కేసీఆర్ను గురువారం శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీర్వదించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్లో ఆయుత చండీయాగం డిసెంబర్ 23వ తేదీన ప్రారంభం కానుంది. 27వ తేదీన ఈ యాగం ముగియనుంది.

చివరి రోజు యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఈ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ యాగానికి దేశంలోని ప్రముఖలను కూడా ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మెదక్ జిల్లా ఎస్పీ సుమతి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement