సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు | ACB raid in sub registrar durga prasad house in vijayawada | Sakshi
Sakshi News home page

సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు

Jan 19 2016 9:36 AM | Updated on Aug 17 2018 12:56 PM

సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు - Sakshi

సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు

బెజవాడ నగరంలోని సబ్ రిజిస్ట్రార్ దుర్గా ప్రసాద్ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు.

విజయవాడ : బెజవాడ నగరంలోని సబ్ రిజిస్ట్రార్ దుర్గా ప్రసాద్ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. శ్రీనివాస బ్యాంక్ కాలనీలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దుర్గా ప్రసాద్ బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేశారు.

సబ్ రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దుర్గా ప్రసాద్తోపాటు ఆయన బంధువుల నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ దాడులు కొనసాగుతున్నాయి.   
 

Advertisement
 
Advertisement
Advertisement