ముగిసిన సండ్ర తొలిరోజు విచారణ | acb first day investigation of sandra venkata veeraiah | Sakshi
Sakshi News home page

ముగిసిన సండ్ర తొలిరోజు విచారణ

Jul 9 2015 6:25 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీలో భాగంగా ఏసీబీ తొలిరోజు విచారణ ముగిసింది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  కస్టడీలో భాగంగా ఏసీబీ తొలిరోజు విచారణ ముగిసింది. శుక్రవారం నాడు కూడా సండ్రను ఏసీబీ విచారించనుంది. ఈ రోజు పలు కీలక అంశాలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.  ఏసీబీ అడిగిన దానికి తనకు ఏమీ తెలియదంటూనే సండ్ర సమాధానాల్ని దాటవేసినట్లు సమాచారం. ఉదయం గం.10 నుంచి సాయంత్రం గం.5 ల వరకూ సండ్రను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు 70 నుంచి 80 ప్రశ్నల వరకూ ఏసీబీ సంధించినట్లు తెలుస్తోంది.

 

సండ్రను న్యాయవాదుల సమక్షంలో  ఏసీబీ విచారించింది.  ఓటుకు కోట్లు కేసులో సండ్రను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement