గాయాల్ని రేపుతున్న దాడులు

Sri Lanka Blasting Reveals Terror Attacks - Sakshi

ఈస్టర్‌ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో జరిగిన దాడులు.. సుదీర్ఘ కాలంపాటు సాగి, పదేళ్ల క్రితం మేలో ముగిసిన అంతర్యుద్ధం జ్ఞాపకాలను మేల్కొలిపాయి. ఈ దాడుల ప్రభావం అంతర్జాతీ యంగా కంటే స్థానిక మతపరమైన అంశాలపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు తోడు, తాజాగా మరింత హింస చెలరేగే అవకాశం ఉంది. 1948 తర్వాత కొత్తగా ఏర్పడిన స్వతంత్ర శ్రీలంక.. సింహళ బౌద్ధ జాతీయ దేశంగా అవతరిం చింది. దీంతో మొత్తం ద్వీప మంతా సింహళ తేర వాద బౌద్ధంకు కీలక స్థానంగా మారింది. సింహళ ప్రాబల్యాన్ని అంగీకరించిన మైనారిటీలకు మాత్రమే అక్కడ జీవించే హక్కు ఉంది. దాన్ని వ్యతిరేకించే వారిపై దాడులు తప్పవు.

రాజ్యాంగంలో కూడా ఇదే వివక్ష కొనసా గింది. సింహళేతరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే గుర్తించారు. రాజ్యం పెంచిపోషిస్తున్న ఈ సింహళ బౌద్ధ స్వభావం దాని వ్యవస్థల్లోకి కూడా పాకింది. భద్రతకు సంబంధించిన విభాగాల్లో ముఖ్యంగా సైన్యంలో పైర్యాంకుల్లో ఉండేవారంతా వారే. అలాగే తమిళ చొరబాటుదార్లను ఏరివేయ డానికి ఏర్పాటు చేసిన విభాగానికి ప్రఖ్యాత సింహళ రాజు పేరిట విజయబహు ఇన్‌ ఫాంట్రీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. స్వతంత్రత, సమాన హక్కులు కావాలంటూ 1950 నుంచి 1970 వరకు సాగిన తమిళుల శాంతి యుత డిమాండ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోప డంతో ద్వీపంలోని ఈశాన్యంలో తమకు స్వతంత్ర మాతృభూమి కావాలని తమిళులు, హిందూ తమి ళులు, క్రైస్తవులు, ముస్లింలు డిమాండ్‌ చేసేవరకు వెళ్లింది. దిగువ స్థాయిలో సాగుతున్న యుద్ధం 1983 నాటికి మరింత రాజుకుంది. బ్లాక్‌ జులై కార్య క్రమాల్లో భాగంగా సింహళ వర్గీయులు తమకు ప్రాబల్యం ఉన్న దక్షిణాదిలో వేలాదిమంది తమి ళులను హతమార్చారు.

శ్రీలంక సైన్యం సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని వేలాదిమందిని హతమార్చింది. ఈ నేప థ్యంలో ఏర్పడిన ఎల్‌టీటీఈకి విస్తృతమైన మద్దతు లభించింది. ఆ సంస్థ ఆత్మాహుతి దళాలను ఏర్పా టుచేసి దక్షిణాదిలో తన ప్రాభవాన్ని చాటుకుంది. ఇదే సందర్భంలో తమిళులు, తమిళం మాట్లాడే ముస్లింల మధ్య ఎవరు అసలైన తమిళులనే విష యమై వైషమ్యాలు చెలరేగి అటు ఎల్‌టీటీఈ, ఇటు సైన్యం చేతిలో ఇరువర్గాలు ఊచకోతకు గుర య్యాయి. 1990లో ఉత్తర ప్రావిన్స్‌ నుంచి సుమారు లక్షమంది ముస్లింలను బహిష్కరించ డంతో వీరి మధ్య విభజన రేఖ మరింత పెరిగింది. యుద్ధ సందర్భంలో తమిళ పౌరులకు ఆశ్రయ మిచ్చాయనే నెపంతో శ్రీలంక సైన్యం అనేక చర్చిలు, దేవాలయాలపై తరచూ బాంబు దాడులకు పాల్ప డింది. ఆ దాడులన్నీ మతపరమైనవిగా గాక ప్రభుత్వ అంగీకారం ఉన్నట్టే భావించాలి. మూడు దశాబ్దాల తర్వాత ఎల్‌టీటీఈ ప్రత్యా మ్నాయ ప్రభుత్వం నడుపుతున్న తరుణంలో శ్రీలంక సైన్యం దాన్ని నెత్తుటి ఏరుల్లో ముంచెత్తి అణచివేసింది. ఈక్రమంలో సుమారు 40వేల మంది చనిపోయినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించగా, అంతకు ఇంకో లక్ష మంది చనిపోయారని కొందరు సామాజిక కార్య కర్తలు చెబుతారు.

యుద్ధం జరుగుతున్నప్పుడు, తర్వాత తమి ళులు అదృశ్యం కావడంపై సైన్యం సమాధానం చెప్పాలని వందలాదిమంది తమిళుల కుటుంబ సభ్యులు ఇంకా డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకపోతే శ్రీలంకలో హింస మరింత పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి అధికా రులు కూడా హెచ్చరించారు. 2009 నుంచి సింహళ బౌద్ధ జాతీయులంతా మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవులపై దృష్టిసారిం చారు. తమిళులందరినీ భద్రతా దళాలు తమ ఉక్కు పిడి కిలిలో బంధించగా, సింహళ బౌద్ధ మూకలన్నీ ముస్లింలు, క్రైస్తవులపై తరచూ దాడులకు పాల్ప డ్డాయి. 2018లో ముస్లిం వ్యతిరేక దాడులతోపాటు క్రైస్తవులపై డజన్ల కొద్దీ దాడులు జరి గాయి. గతంలో తమిళులపై జరిగిన హింసాత్మక అణచివేతను చూసిన ముస్లింలు, క్రైస్తవులు సింహళ జాతీయుల దాడులకు చాలా సంయమనం వహించారు. ఏది ఏమైనప్పటికీ, ఈస్టర్‌ పండుగ రోజు జరిగిన దాడులు గతంలో సింహళీలు జరిపిన హింసా కాండకు ప్రతీకారంగా జరిగినవి కావు. దాడులకు పాల్పడినవారు సింహళ బౌద్ధులను లక్ష్యంగా చేసు కోలేదు. కేవలం క్రైస్తవ సంస్థలు, పర్యాటక సంస్థ లపైనే దాడి చేశారు.

తమిళుల సాయుధ పోరాటానికి క్రైస్తవులంతా మద్దతు ప్రకటించారు. ఇప్పటికే హింసను ఎదు ర్కొంటున్న క్రైస్తవులపై మళ్లీ దాడి చేయడం సరి కాదు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌ చర్చ్‌లో మసీదుపై ఒక క్రిస్టియన్‌ దాడిచేసి ముస్లింలను హతమార్చినందుకే తాము ఇప్పుడు క్రైస్తవులపై దాడి చేశామని ఐసిస్‌ ప్రకటించిన నేపథ్యంలో తాజా పరిస్థితులు ఎటు వంటి ఉద్రిక్తతలకు దారితీస్తాయో, ఏ కొత్త హింస చెలరేగడానికి కారణమవుతాయో చెప్పలేం.

మారియో అరుళ్తాస్‌
(ఆల్‌జజీరా సౌజన్యంతో...)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top