ఐ విట్‌నెస్‌

Funday crime story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

‘‘ఐ విట్‌నెస్‌ ఉందా?’’ అడిగాడు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. తెల్లముఖం వేశాడు క్రైమ్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్‌.‘‘సార్‌! మర్డర్‌ కేసుల్లో ఐ విట్‌నెస్‌ ఎట్లా ఉంటుంది? ఇంపాజిబుల్‌’’ చెప్పాడు జగదీశ్‌.‘‘దినేశ్‌...! మౌనికను కిడ్నాప్‌ చేసి మర్డర్‌ చేశాడని గదా మీ చార్జిషీట్‌? పోనీ అతని మునుషులతో కిడ్నాప్‌ చేయిస్తున్నప్పుడైనా ఏదైనా ఐ విట్‌నెస్‌ ఉందా? చూసిన వాళ్లు ఎవరైనా సాక్ష్యం చెబురారా? ఏ కారులోనో బలవంతంగా ఎత్తుకెళ్లారనుకుందాం. కనీసం ఆ కారు నెంబరైనా ఉంటే, అది ఎవరిది? ఏంటి? అని క్లూ దొరికించుకోవచ్చు. మీ దగ్గర అవేం లేవు. కేసు కోర్టుకి తీసుకెళ్తే గెలిపించేది ఎలా? దినేశ్‌ మర్డర్‌ చేయించాడని ప్రూవ్‌ చేసేది ఎలా? ఏ సాక్ష్యాలు లేవని జడ్జి కొట్టి పారేస్తాడు గదా..’’ చెప్పాడు పి.పి.ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్‌ మౌనంగా ఉండిపోయాడు. మామూలుగా అయితే ఒక యువతి కిడ్నాప్, హత్య పెద్ద విషయం. ఒకవేళ ఇరుక్కున్నా కేసు నీరుగార్చి సాక్ష్యాలు దొరక్కుండా క్లోజ్‌ చేయించడం గతంలో ఎన్నో జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి. అయితే ఈ కేసులో జగదీశ్‌కి శిక్ష వేయించాలని స్థానిక ఎమ్మెల్యే భూపతి పట్టుదలగా ఉన్నాడు. దినేశ్‌ తండ్రి బద్రీనాథ్‌ రౌడీయిజంలో డబ్బు సంపాదించి భూపతికి పోటీగా తయారయ్యాడు. ఒకప్పుడు బద్రీనాథ్‌...భూపతి శిష్యుడే. పోయినసారి ఎన్నికల్లో ప్రతిపక్షం టికెట్‌ సంపాదించి గురువునే ఢీకొని ఉన్నాడు బద్రీనాథ్‌. దినేశ్‌ని మర్డర్‌ కేసులో ఇరికించి జైలుకి పంపితే తను సేఫ్‌. అందుకే పట్టుదలగా పోలీసుల మీద ఒత్తిడి పెంచాడు భూపతి.ఆ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. దినేశ్‌కి శిక్ష వేచించాల్సిన బాధ్యత మీద పడింది. కేసుని క్రైమ్‌ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేయించి చేతులు దులుపుకున్నాడు స్థానిక స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌.సినిమాలలో, టీవీ సీరియల్స్‌లో వేషాలు వేసుకుంటూ ఎప్పటికైనా హీరోయిన్‌ కావాలనే కోరికతో ఉంది మౌనిక. ఆమెను హీరోయిన్‌ చేస్తాననీ, సొంతంగా సినిమా తీస్తానని దినేశ్‌ ప్రామిస్‌ చేశాడు. హీరోయిన్‌ అవుతాననే ఆశతో మౌనిక అతని చేతిలో మోసపోయింది.

ఒక రోజు షూటింగ్‌ ముగించుకుని తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి బయల్దేరింది మౌనిక. ప్రొడక్షన్‌ కారు ఆమెను రోడ్డు పక్కన డ్రాప్‌ చేసి వెళ్లిపోయింది. ఇక రోడ్డు దాటి అవతల వైపున్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లడమే తరువాయి. అంతలో మెరుపు వేగంతో వచ్చిన కారులో నుంచి దిగిన దుండగులు మౌనికను కిడ్నాప్‌ చేసి తీసుకుపోయారు. ఆ సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల సమయం. అపార్ట్‌మెంట్‌ బాల్కానీలో నిల్చున్న అవని అనే అమ్మాయి అది గమనించింది. వెంటనే పోలీసులకు కాల్‌ చేసి చెప్పింది. అయితే ఆమె కారు నెంబర్‌ చెప్పలేకపోయింది. అపార్ట్‌మెంట్‌ నుంచి ఆమెకు కారు పక్కభాగం మాత్రమే కనిపించింది. దుమ్ము రేపుకుంటూ కారు వెళ్లడంతో, కారు నెంబర్‌ ప్లేటు ఆమె చూడలేకపోయింది.రెండు రోజుల తర్వాత ఆమె శవం ఒక చెరువు పక్కన కనిపించింది. గొంతు పిసికి ఊపిరి అందకుండా చేసి హత్య చేసినట్టుగా ఇంక్వెస్ట్‌ రిపోర్టులో వచ్చింది. ఆమె మూడు నెలల గర్భవతి అని నిర్ధారణ అయింది.

అప్పుడే ఎంక్వైరీలో దినేశ్‌ పేరు బయటకు వచ్చింది. హత్యకు ఉపయోగించిన వెపన్‌ లేదు. కేవలం దినేశ్‌ హత్య చేయించాడనేది అనుమానం మాత్రమే. హత్య చేయించాల్సిన అవసరం అతనికే ఉంది మరి.మౌనిక అతనివల్ల గర్భవతి అయింది. ఆమె పెళ్లి చేసుకోమని దినేశ్‌ని ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఆమెను వదిలించుకోవడానికి దినేశ్‌ మర్డర్‌ చేయించి ఉంటాడు. అది వాస్తవం కూడా కావొచ్చు. కానీ నిరూపించి, శిక్ష వేయించడం ఎట్లా?మౌనికతో తన సంబంధాన్ని దాచలేదు దినేశ్‌. ఆమె గర్భవతి అయిందనే సంగతి తెలుసన్నాడు. అదేదో అలా జరిగిపోయిందన్నాడు. మౌనిక కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనే ఆలోచనలోనే తానున్నట్లు చెప్పాడు. ‘‘పెళ్లైపోయిన అమ్మాయికి సినిమారంగంలో క్రేజ్‌ ఉండదనేది యదార్థం. హీరోయిన్‌గా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటే అది వేరే సంగతి. రహస్యంగా పెళ్లి చేసుకొని తనకి ఇంకా పెళ్లికాలేదని వ్యవహరించడమా? లేకపోతే అబార్షన్‌ చేయించడమా? అని నేను, మౌనిక తర్జనభర్జన పడుతున్నాం’’ అని వివరించాడు దినేశ్‌.ఆమెతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న తను హత్య చేయించేంత దుర్మార్గుణ్ని కాదన్నాడు. అసలు హత్య జరిగిన రోజు తను సిటీలో లేడు. స్నేహితులతో గోవా వెళ్లాడు. అందుకు ఎలిబీ ఉంది. వీడియో క్లిప్పింగులు చూపించాడు. అతని పేరుతో హోటల్‌ బిల్లులున్నాయి. సాక్ష్యం చెప్పడానికి ఫ్రెండ్స్‌ ఉన్నారు.నిందితుడు దినేశ్‌ని హంతకుడిగా నిరూపించి ఎలా శిక్ష వేయించాలా? అని తల పట్టుకున్నాడు క్రైమ్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్‌. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అడిగిన ఐ విట్‌నెస్‌ తనెక్కడ సంపాదించాలి?దినేశ్‌ తండ్రి బద్రీనాథ్‌ ఎదురుదాడికి దిగాడు. తన కొడుకుని మర్డర్‌కేసులో ఇరికించి, వాడి భవిష్యత్తును పాడుచేయాలని ఎమ్మెల్యే భూపతి కుట్రలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు.

క్రైమ్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోని ఎస్సై అన్వర్‌ ఆ వీధిలో పచార్లు చేస్తున్నారు. మౌనిక నివాసం ఉన్న సన్‌రైజ్‌ అపార్ట్‌మెంట్‌ ముందు నిల్చున్నారు. అక్కడే మౌనికి కిడ్నాప్‌కు గురైంది.
కొద్దిసేపటి క్రితమే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అవనితోను, వాచ్‌మేన్‌ సిద్ధయ్యనుతోనూ మాట్లాడి వచ్చారు. మౌనిక కిడ్నాప్‌ అయింది  బ్లూ కలర్‌ మారుతి వ్యాన్‌లో అని చెప్పింది అవని. సిద్ధయ్య తను మధ్యాహ్నం మూడింటి ప్రాంతంలో అక్కడ లేనని చెప్పాడు. లోపల వాచ్‌మేన్‌ కోసం కట్టించిన రూమ్‌లో కూర్చుని ఉన్నాననీ. అక్కడి నుంచి చూస్తుంటే గేటులో నుంచి వచ్చీపోయే వారు మాత్రమే కనిపిస్తారని అన్నాడు. తను గేటు దగ్గర ఉంటే మౌనికను కిడ్నాప్‌ చేయడం చూసి ఉండేవాడినని చెప్పాడు.మౌనిక కిడ్నాప్‌ సంఘటనలో ఏదైనా చిన్న ‘క్లూ’ అయినా దొరికితే, తోక పట్టుకుని లాగవచ్చుననే జగదీశ్‌ ఆశ వమ్మయింది. ఇక బయల్దేరదామనుకుంటున్న సమయంలో పొడుగ్గా ఉన్న పదిహేనేళ్ల కుర్రాడు వాళ్ల దగ్గరికి వచ్చాడు. వాడు అన్వర్‌ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. వాడి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంది.‘‘అంకుల్‌! మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా?’’ అని అడిగాడు.‘‘ష్యూర్‌!!’’ అన్నాడు అన్వర్‌.ఆ కుర్రాడు తనని ఎందుకు అడగలేదో జగదీశ్‌కి అర్థమైంది. అతను సివిల్‌ డ్రెస్‌లో ఉన్నాడు. అన్వర్‌ యూనీఫాంలో ఉన్నాడు. అదీ పోలీస్‌ క్రేజ్‌.‘‘సార్‌తో సెల్ఫీ ఎందుకు తీసుకుంటున్నావ్‌?’’ అడిగాడు జగదీశ్‌.‘‘అంకుల్, మా స్కూళ్లో ప్రతాప్‌ అని రౌడీ వెధవ ఉన్నాడు. మమ్మల్ని ఏడిపిస్తుంటాడు. మా దగ్గర చాక్లెట్లు, బిస్కెట్లు లాక్కుంటాడు. ఈ సెల్ఫీ చూపించి వాడిని భయపెడతా. పోలీస్‌ మా అంకుల్‌ అని హడలగొడతా. మా జోలికి రాడు.’’

వాడి ఐడియాకి ఆశ్చర్యపోయాడు జగదీశ్‌.‘‘నీ పేరేంటి బాబూ?’’ అని అడిగాడు.‘‘నాగేశ్‌ అంకుల్‌.’’‘‘ఫోన్‌ పట్టుకుని తిరుగుతున్నావెందుకు? కాస్ట్‌లీ గదా?’’‘‘దీంట్లో ఫొటోలు సూపర్‌ క్లారిటీతో వస్తాయి అంకుల్‌. ఫొటోలు తీయడం నాకు హాబీ. చాలా ఫొటోలు తీశా! చూడండి’’ అంటూ గ్యాలరీ ఓపెన్‌ చేసి స్మార్ట్‌ఫోన్‌ అందించాడు నాగేశ్‌.జగదీశ్‌ గ్యాలరీలో ఉన్న ఫొటోలను చూడసాగాడు. అలా చూస్తూ ఒక ఫొటో దగ్గర ఆగిపోయాడు. అది మౌనికను దుండగులు కిడ్నాప్‌ చేస్తున్న ఫొటో. మారుతీ వ్యాన్‌ నెంబర్‌ స్పష్టంగా కనిపిస్తోంది. కిడ్నాప్‌ చేస్తున్న వాళ్ల ముఖాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.జగదీశ్‌ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.‘‘అన్వర్‌..!! క్లూ దొరికింది.’’ అని ఫొటో చూపించాడు. అన్వర్‌ సంతోషానికి అవధులు లేవు.‘‘సార్‌! మనం వీడికి సన్మానం చేయాలి’’ అంటూ నాగేశ్‌ని మెచ్చుకున్నాడు.

మౌనికను కిడ్నాప్‌ చేసిన వాళ్లు ఫైటర్లు. మొత్తం నలుగురు. పోలీసులకు దొరికిపోయారు. ఫొటోలో ఉన్న ఇద్దర్ని పట్టుకొచ్చి పోలీస్‌ స్టేషన్లో మర్యాదలు రుచి చూపిస్తే మరొక ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. అందర్నీ లాకప్‌లో పడేశారు.వాళ్లు ఆర్‌.సి.రావు పేరు చెప్పారు. వాళ్లతో మౌనికను కిడ్నాప్‌ చేయించింది అతనే. సీనియర్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌. రామచంద్రరావు పూర్తి పేరు. ఆర్‌.సి.రావుగా సినిమా ఫీల్డులో పాపులర్‌.ఆర్‌.సి.రావుని పోలీస్‌ స్టేషన్‌కి పట్టుకొచ్చారు. అతని ద్వారా దినేశే మౌనికను కిడ్నాప్, హత్య చేయించి ఉంటాడని క్రైమ్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్‌ ఊహించాడు.అయితే జగదీశ్‌ ఊహ తప్పయింది.
ఆర్‌.సి.రావుకి తాను దొరికిపోయానని, తప్పించుకునే మార్గం లేదని అర్థమైంది. పోలీసులు లాఠీలకు పని చెప్పక ముందే జరిగింది చెప్పేశాడు.మౌనిక బాగా డబ్బు కూడబెట్టిందని ఆర్‌.సి.రావు గ్రహించాడు. తనకు ఉన్న పరిచయాలతో ఒక చిన్న హీరోను తన సినిమాలో నటించమని ఒప్పించాడు. అదొక హారర్‌ మూవీ. లో బడ్జెట్‌లో తయారవుతోంది. మౌనికను అందులో హీరోయిన్‌గా తీసుకుంటానని ఇరవై లక్షలు తీసుకున్నాడు. లాభంలో భాగం ఇస్తానని ఒప్పించాడు.స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతుండగా ఆర్‌.సి.రావుకి బాగా పరిచమం ఉన్న పెద్ద నిర్మాత అర్జెంటుగా అవసరం ఉందని, తన షూటింగ్‌ నాటికి సర్దుతానని రిక్వెస్ట్‌ చేశాడు. ఆయన పాతిక సినిమాలు తీసిన నిర్మాత. ఆర్‌.సి.రావు ఆయన్ని నమ్మి పాతిక లక్షలు ఇచ్చాడు. ఇక అంతే సంగతులు. నెలలు గడుస్తున్నా ఆ పెద్ద నిర్మాత డబ్బు తిరిగి ఇవ్వడంలేదు. ఆయన అప్పుల్లో మునిగిపోయాడు. ఆ సంగతి ఆర్‌.సి.రావుకు తెలియదు. ఆ విధంగా ఆర్‌.సి.రావు మోసపోయాడు. దిక్కుతోచడం లేదు. తను ఆ నిర్మాతను ఏమీ చేయలేడు.మరొకవైపు మౌనికేమో డబ్బు తిరిగివ్వమని బెదిరిస్తోంది. తనకు పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. ఆమె పీడ వదిలించుకోవడానికి ఆర్‌.సి.రావుకి తట్టిన ఏకైక ఐడియా.. కిడ్నాఫ్, మర్డర్‌.అంతా చెప్పి బోరుమన్నాడు ఆర్‌.సి.రావు.ఐ విట్‌నెస్‌ దొరికింది. ఆర్‌.సి.రావుకి, అతని అనుచరులకి జైలుశిక్ష పడింది.

‘‘అంకుల్, మా స్కూళ్లో ప్రతాప్‌ అని రౌడీ వెధవ ఉన్నాడు. మమ్మల్ని ఏడిపిస్తుంటాడు. మా దగ్గర చాక్లెట్లు, బిస్కెట్లు లాక్కుంటాడు. ఈ సెల్ఫీ చూపించి వాడిని భయపెడతా. పోలీస్‌ మా అంకుల్‌ అనిహడలగొడతా. మా జోలికి రాడు.’’వాడి ఐడియాకి ఆశ్చర్యపోయాడు జగదీశ్‌.‘‘నీ పేరేంటి బాబూ?’’ అని అడిగాడు.‘‘నాగేశ్‌ అంకుల్‌.’’‘‘ఫోన్‌ పట్టుకుని తిరుగుతున్నావెందుకు? కాస్ట్‌లీ గదా?’’‘‘దీంట్లో ఫొటోలు సూపర్‌ క్లారిటీతో వస్తాయి అంకుల్‌. ఫొటోలు తీయడం నాకు హాబీ. చాలా ఫొటోలు తీశా! చూడండి’’ అంటూ గ్యాలరీ ఓపెన్‌ చేసి స్మార్ట్‌ఫోన్‌ అందించాడు నాగేశ్‌.జగదీశ్‌ గ్యాలరీలో ఉన్న ఫొటోలను చూడసాగాడు. అలా చూస్తూ ఒక ఫొటో దగ్గర ఆగిపోయాడు. అది మౌనికను దుండగులు కిడ్నాప్‌ చేస్తున్న ఫొటో. మారుతీ వ్యాన్‌ నెంబర్‌ స్పష్టంగా కనిపిస్తోంది. కిడ్నాప్‌ చేస్తున్న వాళ్ల ముఖాలుక్లియర్‌గా కనిపిస్తున్నాయి.జగదీశ్‌ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.‘‘అన్వర్‌..!! క్లూ దొరికింది.’’ అని ఫొటో చూపించాడు. అన్వర్‌ సంతోషానికి అవధులు లేవు.‘‘సార్‌! మనం వీడికి సన్మానం చేయాలి’’ అంటూ నాగేశ్‌ని మెచ్చుకున్నాడు.

మౌనికను కిడ్నాప్‌ చేసిన వాళ్లు ఫైటర్లు. మొత్తం నలుగురు. పోలీసులకు దొరికిపోయారు. ఫొటోలో ఉన్న ఇద్దర్ని పట్టుకొచ్చి పోలీస్‌ స్టేషన్లో మర్యాదలు రుచి చూపిస్తే మరొక ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. అందర్నీ లాకప్‌లో పడేశారు.వాళ్లు ఆర్‌.సి.రావు పేరు చెప్పారు. వాళ్లతో మౌనికను కిడ్నాప్‌ చేయించింది అతనే. సీనియర్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌. రామచంద్రరావు పూర్తి పేరు. ఆర్‌.సి.రావుగా సినిమా ఫీల్డులో పాపులర్‌.ఆర్‌.సి.రావుని పోలీస్‌ స్టేషన్‌కి పట్టుకొచ్చారు. అతని ద్వారా దినేశే మౌనికను కిడ్నాప్, హత్య చేయించి ఉంటాడని క్రైమ్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్‌ ఊహించాడు.అయితే జగదీశ్‌ ఊహ తప్పయింది.ఆర్‌.సి.రావుకి తాను దొరికిపోయానని, తప్పించుకునే మార్గం లేదని అర్థమైంది. పోలీసులు లాఠీలకు పని చెప్పక ముందే జరిగింది చెప్పేశాడు.మౌనిక బాగా డబ్బు కూడబెట్టిందని ఆర్‌.సి.రావు గ్రహించాడు. తనకు ఉన్న పరిచయాలతో ఒక చిన్న హీరోను తన సినిమాలో నటించమని ఒప్పించాడు. అదొక హారర్‌ మూవీ. లో బడ్జెట్‌లో తయారవుతోంది. మౌనికను అందులో హీరోయిన్‌గా తీసుకుంటానని ఇరవై లక్షలు తీసుకున్నాడు. లాభంలో భాగం ఇస్తానని ఒప్పించాడు.స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతుండగా ఆర్‌.సి.రావుకి బాగా పరిచమం ఉన్న పెద్ద నిర్మాత అర్జెంటుగా అవసరం ఉందని, తన షూటింగ్‌ నాటికి సర్దుతానని రిక్వెస్ట్‌ చేశాడు. ఆయన పాతిక సినిమాలు తీసిన నిర్మాత. ఆర్‌.సి.రావు ఆయన్ని నమ్మి పాతిక లక్షలు ఇచ్చాడు. ఇక అంతే సంగతులు. నెలలు గడుస్తున్నా ఆ పెద్ద నిర్మాత డబ్బు తిరిగి ఇవ్వడంలేదు. ఆయన అప్పుల్లో మునిగిపోయాడు. ఆ సంగతి ఆర్‌.సి.రావుకు తెలియదు. ఆ విధంగా ఆర్‌.సి.రావు మోసపోయాడు. దిక్కుతోచడం లేదు. తను ఆ నిర్మాతను ఏమీ చేయలేడు.మరొకవైపు మౌనికేమో డబ్బు తిరిగివ్వమని బెదిరిస్తోంది. తనకు పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. ఆమె పీడ వదిలించుకోవడానికి ఆర్‌.సి.రావుకి తట్టిన ఏకైక ఐడియా.. కిడ్నాఫ్, మర్డర్‌. అంతా చెప్పి బోరుమన్నాడు ఆర్‌.సి.రావు.ఐ విట్‌నెస్‌ దొరికింది. ఆర్‌.సి.రావుకి, అతని అనుచరులకి జైలుశిక్ష పడింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top