breaking news
Witnesses
-
రహస్య రికార్డింగులు సాక్ష్యాలే
న్యూఢిల్లీ: జీవిత భాగస్వాములతో సంభాషణను రహస్యంగా రికార్డు చేయడం విడాకులతో పాటు అన్నిరకాల వైవాహిక వివాదాల్లోనూ సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు సంభాషణలకు సాక్ష్యాల చట్టంలోని 122వ సెక్షన్ కింద రక్షణ ఉంటుందని, కనుక వాటిని న్యాయ వివాదాల్లో ఉపయోగించడాన్ని అనుమతించలేమని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. వాటిని సాక్ష్యాలుగా అనుమతిస్తే వైవాహిక బంధాన్ని, కుటుంబంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, భాగస్వామిపై గూఢచర్యానికి దారి తీస్తాయని హైకోర్టు వెలువరించిన అభిప్రాయాలతో ధర్మాసనం విభేదించింది. ‘‘ఇలాంటివి చెల్లుబాటయ్యే వాదనలు కావన్నది మా అభిప్రాయం. భార్యాభర్తలు పరస్పరం తరచూ ఇలా సంభాషణను గుట్టుగా రికార్డు చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారంటేనే ఆ బంధం బీటలు వారిందని, వారి మధ్య విశ్వాసం సన్నగిల్లిందని అర్థం. కనుక అలాంటి పరిస్థితుల్లో గోప్యంగా రికార్డు చేసిన భాగస్వామి తాలూకు సంభాషణను సాక్ష్యంగా అంగీకరించడం అసమంజమేమీ కాదు. ఎందుకంటే అది వైవాహిక సమస్యల తాలూకు ఫలితమే తప్ప వాటికి కారణం కాదు’’ అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ‘‘122వ సెక్షన్ పేర్కొంటున్న గోప్యత హక్కు భార్యాభర్తల సంభాషణలకు కూడా వర్తిస్తుందన్నది నిజమే. కానీ అది సంపూర్ణమైనది కాదు. ఈ అంశాన్ని ఆ సెక్షన్‌కు ఇచ్చిన మినహాయింపులతో కలిపి చూడాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఇలాంటి విషయాల్లో గోప్యత హక్కు కంటే కూడా సక్రమ విచారణ హక్కుదే పై చేయి అవుతుంది. వైవాహిక బంధం విచి్ఛన్నమయ్యే స్థితికి చేరినప్పుడు భాగస్వాములకు తమ వాదనను రుజువు చేసే సాక్ష్యాలు సమరి్పంచే హక్కును గోప్యత తదితరాలను ప్రాతిపదికగా చూపి కాలరాయలేం’’ అని స్పష్టం చేసింది. 2017 నాటి ఓ విడాకుల కేసులో భార్యకు తెలియకుండా భర్త జరిపిన ఆమె సంభాషణల రికార్డులను సాక్ష్యంగా అనుమతిస్తూ పంజాబ్‌లోని భటిండా ఫ్యామిలీ కోర్టు ఇచి్చన తీర్పును పునరుద్ధరించింది. -
హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
గౌహతి/షిల్లాంగ్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కొత్త జంట హనీమూన్‌కు వెళ్లి, అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఉదంతంలో భర్త రాజా రఘువంశీ హత్యకు గురికాగా, భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. తాజాగా ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పోలీసులు అరెస్టు చేశారు.భర్త హత్య కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సోనమ్ కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని, భర్తను హత్య చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ మాట్లాడుతూ సోనమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో అదుపులోకి తీసుకున్నామని, ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.దర్యాప్తు జరిగిదిలా..మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ సోనమ్ దంపతులు మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లోని నోంగ్రియాట్ గ్రామంలో గడిపిన 12 గంటల సమయంలో వారు ఏమి చేశారనేది ఆధారంగా చేసుకుని, పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగారు. ఇందుకోసం వారు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. మే 23న కనిపించకుండా పోయిన వీరు దీనికి ముందు మేఘాలయలోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్ ఆచూకీ కోసం పోలీసులు పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు గాలించాయి. సోనమ్ కుటుంబ సభ్యులు ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.మే 21న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఒక గెస్ట్‌హౌస్‌కు ఆ జంట ముందుగా చేరుకుంది. మరుసటి రోజు వారు స్కూటీని అద్దెకు తీసుకుని, పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరాపుంజి)కి వెళ్లారు. తరువాత వారు తూర్పు ఖాసీ హిల్స్‌లోని మావ్లాఖియాట్ గ్రామానికి చేరుకుని, స్కూటీని పార్కింగ్ స్థలంలో ఉంచారు. అక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్‌ను సంప్రదించారు. అతను మావ్లాఖియాట్ నుండి నాంగ్రియాట్కు ట్రెక్కింగ్‌కు చేరేందుకు మూడు గంటలు పడుతుందని, మూడు వేల మెట్లు దిగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పటికే టైమ్ అయిపోయిందని, మర్నాడు వెళ్లవచ్చని గైడ్ వారికి చెప్పాడు. అయితే ఆ జంట తమకు రూట్ తెలుసని, గైడ్ సర్వీస్ అవసరం లేదని చెప్పారు.కాగా రాజా రఘువంశీ సోనమ్ దంపతులకు హోమ్ స్టే కల్పించిన ఒక మహిళ పోలీసులు విచారణలో వారిద్దరూ సాయంత్రం 5.30 గంటలకు నోంగ్రియాట్ గ్రామంలోని తమ షిపారా హోమ్‌స్టేకు వచ్చారని తెలిపారు. తాను రూమ్ ఛార్జీలు తీసుకుని, రిజిస్టర్లో సైన్ ఇన్ చేయమని చెప్పి, వారి గదిని చూపించానన్నారు. వారు చెక్ ఇన్ చేసి, గదికి తాళం వేసి లివింగ్ రూట్ బ్రిడ్జిలను చూడటానికి వెళ్లారని ఆ మహిళ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి వచ్చి, భోజనం చేసి, రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని ఆమె తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే.. మరుసటి రోజు ఉదయం ఆ జంట త్వరగా చెక్ అవుట్ చేస్తామని హోమ్‌స్టే యజమానికి చెప్పారు. అల్పాహారం వద్దని, ఆకలిగా లేదని చెప్పి ట్రెక్కింగ్ కోసం వెళతామని అతనితో అన్నారు. మే 23న ఉదయం 6 గంటలకు ఆ జంట హోమ్‌స్టే నుండి బయలుదేరింది. ఆ జంటను చూసిన చివరి వ్యక్తి గైడ్ ఆల్బర్ట్ పిడే. పోలీసుల విచారణలో అతను 23న ఉదయం 10 గంటల సమయంలో ఆ జంట ముగ్గురు టూరిస్టులతో పాటు మావ్లాఖియాత్ గ్రామం వైపు వెళ్లడం చూశానని తెలిపాడు. ఆ తర్వాత నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది. -
మృత్యుకేళికి సాక్ష్యం.. తాజా వీడియో
యూపీలోని హత్రాస్‌లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. లెక్కలేనంతమంది గాయపడ్డారు. సత్సంగం జరిగిన ప్రాంతానికి చెందిన తాజా వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ మౌనం తాండవిస్తోంది. నిన్న(మంగళవారం) జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 40 వేల మంది పాల్గొన్నారు. #WATCH | Uttar Pradesh: Visuals from the incident spot where a stampede took place yesterday, claiming the lives of 116 people in Hathras. The incident happened during a Satsang conducted by 'Bhole Baba'. pic.twitter.com/7wfXYFRHIO— ANI (@ANI) July 3, 2024నారాయణ్ సకర్ విశ్వ హరిగా పేరొందిన భోలే బాబా సత్సంగ కార్యక్రమానికి హాజరైన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన సికంద్రరావు కొత్వాలి ప్రాంతంలోని జీటీ రోడ్డులోని ఫుల్రాయ్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.సత్సంగానికి పెద్ద సంఖ్యలో జనం హాజరు కావడం, నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. కాగా యూపీ సీఎం యోగి ఈరోజు(బుధవారం) హత్రాస్ బాధితులను పరామర్శించనున్నారు. -
సాక్షులను బెదిరిస్తున్న చంద్రబాబు
-
Delhi Woman's Death Case: వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానుష ఘటనపై అధికారులు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. విచారణలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విషయాలను విని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలానే సీసీఫుటేజ్ దృశ్యాలు సైతం నివ్వెరపోయేలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ ఘటననే చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా మాట్లాడుతూ...ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగినట్లు తెలిపాడు. అతను తన మిఠాయి షాపు వద్ద ఉండగా.. సుమారు వంద మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చింది. కారు టైరు పేలిందనుకున్నా.. కానీ కారు కదిలినప్పుడూ ఒక మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. తాను పెద్దగా అరుస్తూ వాహనాన్ని ఆపేందుకు మోటారు బైక్‌తో వెంబడించి యత్నించాను కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నరపాటు ఆ యువతి మృతదేహాన్ని 20 కి.మీ దూరం ఈడ్చుకెళ్లారని తెలిపాడు. వారు యూటర్న్ తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాదని దహియా నొక్కి చెప్పాడు. అంతేగాదు సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం వేరయ్యిందని, ఆ తర్వాత నిందితులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పాడు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ...కారు ఢీ కొట్టడంతో యువతి స్కూటీ నుంచి పడిపోయిందని, ఆ తర్వాత చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. వాహనం రిజిస్టర్ నెంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వాహనం కిటికీలు మూసి ఉన్నాయి, పైగా సంగీతం బిగ్గరగా వస్తున్నందున్న తమకు ఏం జరిగిందో తెలియలేదని నిందితులు చెబుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పరారయ్యినట్లు పోలీసులకు తెలిపారు. ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. 🔴#BREAKING | New CCTV Confirms Witness Account, Car Makes U-Turn, Drags Delhi Woman https://t.co/wPFfrz6eKV pic.twitter.com/DvUDIbbwfM — Breaking News (@feeds24x7) January 2, 2023 (చదవండి: ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది) -
అమరావతి అసైన్డ్ భూముల కేసులో సాక్షులకు టీడీపీ బెదిరింపులు
సాక్షి, అమరావతి: ఇంటి గుట్టు రట్టు లంకకు చేటు తెచ్చిందని ఆనాడు రావణుడు నేలకొరుగుతూ వాపోయాడు. అమరావతి భూదందా గుట్టు రట్టవడం టీడీపీకి చేటు అంటూ ఇప్పుడు చంద్రబాబు చుర్రుబుర్రులాడుతున్నారు. అమరావతిలో రూ.4,000 కోట్ల అసైన్డ్ భూములు కొల్లగొట్టిన దందా బట్టబయలు కావడంతో సీఐడీ కేసులు నమోదు చేసింది. టీడీపీ నేతలు ఆ భూములు ఎలా కొల్లగొట్టారో కొందరు సాక్షులు సీఐడీకి వివరంగా చెప్పడంతో చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులో సాక్షుల వాంగ్మూలం కాపీలు దక్కించుకోవడమే కాకుండా .. వాటి ఆధారంగా సాక్షులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే అసైన్డ్ జీవో అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టిన పచ్చ గద్దల కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు పలువురు ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులను విచారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు, వారి బినామీలు అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములు కొల్లగొట్టిన వైనంపై ప్రధానంగా దృష్టిసారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏకంగా 964 ఎకరాలను అసైన్డ్ భూముల చట్టానికి విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. ఆ తరువాత అసైన్డ్ భూములకు కూడా భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. దాంతో ఏకంగా రూ. 4 వేల కోట్ల విలువైన 964 ఎకరాలు చంద్రబాబు బినామీలు, అస్మదీయుల గుప్పిట్లోకి చేరాయి. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆనాటి ఉన్నతాధికారులు ఎంతగా చెప్పినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ససేమిరా అన్నారు. వారిద్దరి ఒత్తిడితోనే ఉన్నతాధికారులు జీవో 41 జారీ చేశారు. ఇదే విషయాన్ని ఆ ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులు సీఐడీ దర్యాప్తులో వెల్లడించారు. ఈ మేరకు సెక్షన్ 164 కింద వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. దాంతో చంద్రబాబు సాగించిన భూదందా అధికారికంగా బట్టబయలైంది. ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగుతోంది. టీడీపీ చేతిలో వాంగ్మూలం కాపీలు.. సాక్షులపై ఒత్తిళ్లు రోజురోజుకు వ్యవహారం ప్రతికూలంగా మారుతుండటంతో అసైన్డ్ భూముల కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు అండ్ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ కేసులో సాక్షులను లక్ష్యంగా చేసుకున్నారు. సీఐడీకి సాక్షులు సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను నిబంధనలకు విరుద్ధంగా సంపాదించారు. వీటిలో సాక్షులు వెల్లడించిన వాస్తవాలతో చంద్రబాబు బ్యాచ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. దాంతో సాక్షులపై ఒత్తిళ్లు, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘మనం మనం’ ఒకటి కదా అంటూ బతిమాలుతూనే, బెదిరింపులకూ పాల్పడుతున్నట్లు సమాచారం. తమ వర్గాల ద్వారా వేర్వేరు మార్గాల్లో ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. దాంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము ఇచ్చిన వాంగ్మూలం కాపీలు టీడీపీ చేతుల్లోకి పోవడంతో అసైన్డ్ భూముల కేసులో కీలక సాక్షులు ఆందోళన చెందుతున్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
రానున్న 12-18 గంటల్లో తీవ్ర మంచు వర్షాలు! రహదారుల మూసివేత..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్, లడఖ్ ఎగువ ప్రాంతాల్లో ఆదివారం (డిసెంబర్ 5) తీవ్రంగా మంచు కురువడంతో బందిపోరా-గురెజ్, సింథన్-కిష్త్వార్, మొఘల్ రహదారులతో సహా సరిహద్దు రహదారులను మూసివేశారు. రానున్న 12 నుంచి 18 గంటల్లో తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు. కాశ్మీర్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసినట్లుగా, అనేక హిల్ స్టేషన్లతో సహా యూనియన్ టెరిటరీ ఎగువ ప్రాంతాల్లో ఉదయం నుండి మంచు వానలు కురుస్తున్నాయి. నిరంతరంగా కురుస్తున్న మంచు కారణంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో 3 నుంచి 4 అంగుళాలమేర మంచు పేరుకుపోయింది. మరొపక్క ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చదవండి: కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా.. -
ఐ విట్నెస్
‘‘ఐ విట్నెస్ ఉందా?’’ అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. తెల్లముఖం వేశాడు క్రైమ్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీశ్.‘‘సార్! మర్డర్ కేసుల్లో ఐ విట్నెస్ ఎట్లా ఉంటుంది? ఇంపాజిబుల్’’ చెప్పాడు జగదీశ్.‘‘దినేశ్...! మౌనికను కిడ్నాప్ చేసి మర్డర్ చేశాడని గదా మీ చార్జిషీట్? పోనీ అతని మునుషులతో కిడ్నాప్ చేయిస్తున్నప్పుడైనా ఏదైనా ఐ విట్నెస్ ఉందా? చూసిన వాళ్లు ఎవరైనా సాక్ష్యం చెబురారా? ఏ కారులోనో బలవంతంగా ఎత్తుకెళ్లారనుకుందాం. కనీసం ఆ కారు నెంబరైనా ఉంటే, అది ఎవరిది? ఏంటి? అని క్లూ దొరికించుకోవచ్చు. మీ దగ్గర అవేం లేవు. కేసు కోర్టుకి తీసుకెళ్తే గెలిపించేది ఎలా? దినేశ్ మర్డర్ చేయించాడని ప్రూవ్ చేసేది ఎలా? ఏ సాక్ష్యాలు లేవని జడ్జి కొట్టి పారేస్తాడు గదా..’’ చెప్పాడు పి.పి.ఇన్స్పెక్టర్ జగదీశ్ మౌనంగా ఉండిపోయాడు. మామూలుగా అయితే ఒక యువతి కిడ్నాప్, హత్య పెద్ద విషయం. ఒకవేళ ఇరుక్కున్నా కేసు నీరుగార్చి సాక్ష్యాలు దొరక్కుండా క్లోజ్ చేయించడం గతంలో ఎన్నో జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి. అయితే ఈ కేసులో జగదీశ్‌కి శిక్ష వేయించాలని స్థానిక ఎమ్మెల్యే భూపతి పట్టుదలగా ఉన్నాడు. దినేశ్ తండ్రి బద్రీనాథ్ రౌడీయిజంలో డబ్బు సంపాదించి భూపతికి పోటీగా తయారయ్యాడు. ఒకప్పుడు బద్రీనాథ్...భూపతి శిష్యుడే. పోయినసారి ఎన్నికల్లో ప్రతిపక్షం టికెట్ సంపాదించి గురువునే ఢీకొని ఉన్నాడు బద్రీనాథ్. దినేశ్‌ని మర్డర్ కేసులో ఇరికించి జైలుకి పంపితే తను సేఫ్. అందుకే పట్టుదలగా పోలీసుల మీద ఒత్తిడి పెంచాడు భూపతి.ఆ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. దినేశ్‌కి శిక్ష వేచించాల్సిన బాధ్యత మీద పడింది. కేసుని క్రైమ్ బ్రాంచ్‌కి ట్రాన్స్ఫర్ చేయించి చేతులు దులుపుకున్నాడు స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్.సినిమాలలో, టీవీ సీరియల్స్‌లో వేషాలు వేసుకుంటూ ఎప్పటికైనా హీరోయిన్ కావాలనే కోరికతో ఉంది మౌనిక. ఆమెను హీరోయిన్ చేస్తాననీ, సొంతంగా సినిమా తీస్తానని దినేశ్ ప్రామిస్ చేశాడు. హీరోయిన్ అవుతాననే ఆశతో మౌనిక అతని చేతిలో మోసపోయింది. ఒక రోజు షూటింగ్ ముగించుకుని తను ఉంటున్న అపార్ట్మెంట్కి బయల్దేరింది మౌనిక. ప్రొడక్షన్ కారు ఆమెను రోడ్డు పక్కన డ్రాప్ చేసి వెళ్లిపోయింది. ఇక రోడ్డు దాటి అవతల వైపున్న అపార్ట్మెంట్లోకి వెళ్లడమే తరువాయి. అంతలో మెరుపు వేగంతో వచ్చిన కారులో నుంచి దిగిన దుండగులు మౌనికను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఆ సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల సమయం. అపార్ట్మెంట్ బాల్కానీలో నిల్చున్న అవని అనే అమ్మాయి అది గమనించింది. వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్పింది. అయితే ఆమె కారు నెంబర్ చెప్పలేకపోయింది. అపార్ట్మెంట్ నుంచి ఆమెకు కారు పక్కభాగం మాత్రమే కనిపించింది. దుమ్ము రేపుకుంటూ కారు వెళ్లడంతో, కారు నెంబర్ ప్లేటు ఆమె చూడలేకపోయింది.రెండు రోజుల తర్వాత ఆమె శవం ఒక చెరువు పక్కన కనిపించింది. గొంతు పిసికి ఊపిరి అందకుండా చేసి హత్య చేసినట్టుగా ఇంక్వెస్ట్ రిపోర్టులో వచ్చింది. ఆమె మూడు నెలల గర్భవతి అని నిర్ధారణ అయింది. అప్పుడే ఎంక్వైరీలో దినేశ్ పేరు బయటకు వచ్చింది. హత్యకు ఉపయోగించిన వెపన్ లేదు. కేవలం దినేశ్ హత్య చేయించాడనేది అనుమానం మాత్రమే. హత్య చేయించాల్సిన అవసరం అతనికే ఉంది మరి.మౌనిక అతనివల్ల గర్భవతి అయింది. ఆమె పెళ్లి చేసుకోమని దినేశ్‌ని ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఆమెను వదిలించుకోవడానికి దినేశ్ మర్డర్ చేయించి ఉంటాడు. అది వాస్తవం కూడా కావొచ్చు. కానీ నిరూపించి, శిక్ష వేయించడం ఎట్లా?మౌనికతో తన సంబంధాన్ని దాచలేదు దినేశ్. ఆమె గర్భవతి అయిందనే సంగతి తెలుసన్నాడు. అదేదో అలా జరిగిపోయిందన్నాడు. మౌనిక కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనే ఆలోచనలోనే తానున్నట్లు చెప్పాడు. ‘‘పెళ్లైపోయిన అమ్మాయికి సినిమారంగంలో క్రేజ్ ఉండదనేది యదార్థం. హీరోయిన్గా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటే అది వేరే సంగతి. రహస్యంగా పెళ్లి చేసుకొని తనకి ఇంకా పెళ్లికాలేదని వ్యవహరించడమా? లేకపోతే అబార్షన్ చేయించడమా? అని నేను, మౌనిక తర్జనభర్జన పడుతున్నాం’’ అని వివరించాడు దినేశ్.ఆమెతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న తను హత్య చేయించేంత దుర్మార్గుణ్ని కాదన్నాడు. అసలు హత్య జరిగిన రోజు తను సిటీలో లేడు. స్నేహితులతో గోవా వెళ్లాడు. అందుకు ఎలిబీ ఉంది. వీడియో క్లిప్పింగులు చూపించాడు. అతని పేరుతో హోటల్ బిల్లులున్నాయి. సాక్ష్యం చెప్పడానికి ఫ్రెండ్స్ ఉన్నారు.నిందితుడు దినేశ్‌ని హంతకుడిగా నిరూపించి ఎలా శిక్ష వేయించాలా? అని తల పట్టుకున్నాడు క్రైమ్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీశ్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన ఐ విట్నెస్ తనెక్కడ సంపాదించాలి?దినేశ్ తండ్రి బద్రీనాథ్ ఎదురుదాడికి దిగాడు. తన కొడుకుని మర్డర్‌కేసులో ఇరికించి, వాడి భవిష్యత్తును పాడుచేయాలని ఎమ్మెల్యే భూపతి కుట్రలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. క్రైమ్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీశ్, స్థానిక పోలీస్ స్టేషన్‌లోని ఎస్సై అన్వర్ ఆ వీధిలో పచార్లు చేస్తున్నారు. మౌనిక నివాసం ఉన్న సన్‌రైజ్ అపార్ట్మెంట్ ముందు నిల్చున్నారు. అక్కడే మౌనికి కిడ్నాప్‌కు గురైంది. కొద్దిసేపటి క్రితమే అదే అపార్ట్మెంట్లో ఉంటున్న అవనితోను, వాచ్‌మేన్ సిద్ధయ్యనుతోనూ మాట్లాడి వచ్చారు. మౌనిక కిడ్నాప్ అయింది బ్లూ కలర్ మారుతి వ్యాన్‌లో అని చెప్పింది అవని. సిద్ధయ్య తను మధ్యాహ్నం మూడింటి ప్రాంతంలో అక్కడ లేనని చెప్పాడు. లోపల వాచ్‌మేన్ కోసం కట్టించిన రూమ్‌లో కూర్చుని ఉన్నాననీ. అక్కడి నుంచి చూస్తుంటే గేటులో నుంచి వచ్చీపోయే వారు మాత్రమే కనిపిస్తారని అన్నాడు. తను గేటు దగ్గర ఉంటే మౌనికను కిడ్నాప్ చేయడం చూసి ఉండేవాడినని చెప్పాడు.మౌనిక కిడ్నాప్ సంఘటనలో ఏదైనా చిన్న ‘క్లూ’ అయినా దొరికితే, తోక పట్టుకుని లాగవచ్చుననే జగదీశ్ ఆశ వమ్మయింది. ఇక బయల్దేరదామనుకుంటున్న సమయంలో పొడుగ్గా ఉన్న పదిహేనేళ్ల కుర్రాడు వాళ్ల దగ్గరికి వచ్చాడు. వాడు అన్వర్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. వాడి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది.‘‘అంకుల్! మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా?’’ అని అడిగాడు.‘‘ష్యూర్!!’’ అన్నాడు అన్వర్.ఆ కుర్రాడు తనని ఎందుకు అడగలేదో జగదీశ్‌కి అర్థమైంది. అతను సివిల్ డ్రెస్‌లో ఉన్నాడు. అన్వర్ యూనీఫాంలో ఉన్నాడు. అదీ పోలీస్ క్రేజ్.‘‘సార్‌తో సెల్ఫీ ఎందుకు తీసుకుంటున్నావ్?’’ అడిగాడు జగదీశ్.‘‘అంకుల్, మా స్కూళ్లో ప్రతాప్ అని రౌడీ వెధవ ఉన్నాడు. మమ్మల్ని ఏడిపిస్తుంటాడు. మా దగ్గర చాక్లెట్లు, బిస్కెట్లు లాక్కుంటాడు. ఈ సెల్ఫీ చూపించి వాడిని భయపెడతా. పోలీస్ మా అంకుల్ అని హడలగొడతా. మా జోలికి రాడు.’’ వాడి ఐడియాకి ఆశ్చర్యపోయాడు జగదీశ్.‘‘నీ పేరేంటి బాబూ?’’ అని అడిగాడు.‘‘నాగేశ్ అంకుల్.’’‘‘ఫోన్ పట్టుకుని తిరుగుతున్నావెందుకు? కాస్ట్లీ గదా?’’‘‘దీంట్లో ఫొటోలు సూపర్ క్లారిటీతో వస్తాయి అంకుల్. ఫొటోలు తీయడం నాకు హాబీ. చాలా ఫొటోలు తీశా! చూడండి’’ అంటూ గ్యాలరీ ఓపెన్ చేసి స్మార్ట్‌ఫోన్ అందించాడు నాగేశ్.జగదీశ్ గ్యాలరీలో ఉన్న ఫొటోలను చూడసాగాడు. అలా చూస్తూ ఒక ఫొటో దగ్గర ఆగిపోయాడు. అది మౌనికను దుండగులు కిడ్నాప్ చేస్తున్న ఫొటో. మారుతీ వ్యాన్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. కిడ్నాప్ చేస్తున్న వాళ్ల ముఖాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.జగదీశ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.‘‘అన్వర్..!! క్లూ దొరికింది.’’ అని ఫొటో చూపించాడు. అన్వర్ సంతోషానికి అవధులు లేవు.‘‘సార్! మనం వీడికి సన్మానం చేయాలి’’ అంటూ నాగేశ్‌ని మెచ్చుకున్నాడు. మౌనికను కిడ్నాప్ చేసిన వాళ్లు ఫైటర్లు. మొత్తం నలుగురు. పోలీసులకు దొరికిపోయారు. ఫొటోలో ఉన్న ఇద్దర్ని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో మర్యాదలు రుచి చూపిస్తే మరొక ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. అందర్నీ లాకప్‌లో పడేశారు.వాళ్లు ఆర్.సి.రావు పేరు చెప్పారు. వాళ్లతో మౌనికను కిడ్నాప్ చేయించింది అతనే. సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్. రామచంద్రరావు పూర్తి పేరు. ఆర్.సి.రావుగా సినిమా ఫీల్డులో పాపులర్.ఆర్.సి.రావుని పోలీస్ స్టేషన్‌కి పట్టుకొచ్చారు. అతని ద్వారా దినేశే మౌనికను కిడ్నాప్, హత్య చేయించి ఉంటాడని క్రైమ్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీశ్ ఊహించాడు.అయితే జగదీశ్ ఊహ తప్పయింది. ఆర్.సి.రావుకి తాను దొరికిపోయానని, తప్పించుకునే మార్గం లేదని అర్థమైంది. పోలీసులు లాఠీలకు పని చెప్పక ముందే జరిగింది చెప్పేశాడు.మౌనిక బాగా డబ్బు కూడబెట్టిందని ఆర్.సి.రావు గ్రహించాడు. తనకు ఉన్న పరిచయాలతో ఒక చిన్న హీరోను తన సినిమాలో నటించమని ఒప్పించాడు. అదొక హారర్ మూవీ. లో బడ్జెట్లో తయారవుతోంది. మౌనికను అందులో హీరోయిన్గా తీసుకుంటానని ఇరవై లక్షలు తీసుకున్నాడు. లాభంలో భాగం ఇస్తానని ఒప్పించాడు.స్క్రిప్ట్‌వర్క్ జరుగుతుండగా ఆర్.సి.రావుకి బాగా పరిచమం ఉన్న పెద్ద నిర్మాత అర్జెంటుగా అవసరం ఉందని, తన షూటింగ్ నాటికి సర్దుతానని రిక్వెస్ట్ చేశాడు. ఆయన పాతిక సినిమాలు తీసిన నిర్మాత. ఆర్.సి.రావు ఆయన్ని నమ్మి పాతిక లక్షలు ఇచ్చాడు. ఇక అంతే సంగతులు. నెలలు గడుస్తున్నా ఆ పెద్ద నిర్మాత డబ్బు తిరిగి ఇవ్వడంలేదు. ఆయన అప్పుల్లో మునిగిపోయాడు. ఆ సంగతి ఆర్.సి.రావుకు తెలియదు. ఆ విధంగా ఆర్.సి.రావు మోసపోయాడు. దిక్కుతోచడం లేదు. తను ఆ నిర్మాతను ఏమీ చేయలేడు.మరొకవైపు మౌనికేమో డబ్బు తిరిగివ్వమని బెదిరిస్తోంది. తనకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఆమె పీడ వదిలించుకోవడానికి ఆర్.సి.రావుకి తట్టిన ఏకైక ఐడియా.. కిడ్నాఫ్, మర్డర్.అంతా చెప్పి బోరుమన్నాడు ఆర్.సి.రావు.ఐ విట్నెస్ దొరికింది. ఆర్.సి.రావుకి, అతని అనుచరులకి జైలుశిక్ష పడింది. ‘‘అంకుల్, మా స్కూళ్లో ప్రతాప్ అని రౌడీ వెధవ ఉన్నాడు. మమ్మల్ని ఏడిపిస్తుంటాడు. మా దగ్గర చాక్లెట్లు, బిస్కెట్లు లాక్కుంటాడు. ఈ సెల్ఫీ చూపించి వాడిని భయపెడతా. పోలీస్ మా అంకుల్ అనిహడలగొడతా. మా జోలికి రాడు.’’వాడి ఐడియాకి ఆశ్చర్యపోయాడు జగదీశ్.‘‘నీ పేరేంటి బాబూ?’’ అని అడిగాడు.‘‘నాగేశ్ అంకుల్.’’‘‘ఫోన్ పట్టుకుని తిరుగుతున్నావెందుకు? కాస్ట్లీ గదా?’’‘‘దీంట్లో ఫొటోలు సూపర్ క్లారిటీతో వస్తాయి అంకుల్. ఫొటోలు తీయడం నాకు హాబీ. చాలా ఫొటోలు తీశా! చూడండి’’ అంటూ గ్యాలరీ ఓపెన్ చేసి స్మార్ట్‌ఫోన్ అందించాడు నాగేశ్.జగదీశ్ గ్యాలరీలో ఉన్న ఫొటోలను చూడసాగాడు. అలా చూస్తూ ఒక ఫొటో దగ్గర ఆగిపోయాడు. అది మౌనికను దుండగులు కిడ్నాప్ చేస్తున్న ఫొటో. మారుతీ వ్యాన్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. కిడ్నాప్ చేస్తున్న వాళ్ల ముఖాలుక్లియర్గా కనిపిస్తున్నాయి.జగదీశ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.‘‘అన్వర్..!! క్లూ దొరికింది.’’ అని ఫొటో చూపించాడు. అన్వర్ సంతోషానికి అవధులు లేవు.‘‘సార్! మనం వీడికి సన్మానం చేయాలి’’ అంటూ నాగేశ్‌ని మెచ్చుకున్నాడు. మౌనికను కిడ్నాప్ చేసిన వాళ్లు ఫైటర్లు. మొత్తం నలుగురు. పోలీసులకు దొరికిపోయారు. ఫొటోలో ఉన్న ఇద్దర్ని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో మర్యాదలు రుచి చూపిస్తే మరొక ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. అందర్నీ లాకప్‌లో పడేశారు.వాళ్లు ఆర్.సి.రావు పేరు చెప్పారు. వాళ్లతో మౌనికను కిడ్నాప్ చేయించింది అతనే. సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్. రామచంద్రరావు పూర్తి పేరు. ఆర్.సి.రావుగా సినిమా ఫీల్డులో పాపులర్.ఆర్.సి.రావుని పోలీస్ స్టేషన్‌కి పట్టుకొచ్చారు. అతని ద్వారా దినేశే మౌనికను కిడ్నాప్, హత్య చేయించి ఉంటాడని క్రైమ్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగదీశ్ ఊహించాడు.అయితే జగదీశ్ ఊహ తప్పయింది.ఆర్.సి.రావుకి తాను దొరికిపోయానని, తప్పించుకునే మార్గం లేదని అర్థమైంది. పోలీసులు లాఠీలకు పని చెప్పక ముందే జరిగింది చెప్పేశాడు.మౌనిక బాగా డబ్బు కూడబెట్టిందని ఆర్.సి.రావు గ్రహించాడు. తనకు ఉన్న పరిచయాలతో ఒక చిన్న హీరోను తన సినిమాలో నటించమని ఒప్పించాడు. అదొక హారర్ మూవీ. లో బడ్జెట్లో తయారవుతోంది. మౌనికను అందులో హీరోయిన్గా తీసుకుంటానని ఇరవై లక్షలు తీసుకున్నాడు. లాభంలో భాగం ఇస్తానని ఒప్పించాడు.స్క్రిప్ట్‌వర్క్ జరుగుతుండగా ఆర్.సి.రావుకి బాగా పరిచమం ఉన్న పెద్ద నిర్మాత అర్జెంటుగా అవసరం ఉందని, తన షూటింగ్ నాటికి సర్దుతానని రిక్వెస్ట్ చేశాడు. ఆయన పాతిక సినిమాలు తీసిన నిర్మాత. ఆర్.సి.రావు ఆయన్ని నమ్మి పాతిక లక్షలు ఇచ్చాడు. ఇక అంతే సంగతులు. నెలలు గడుస్తున్నా ఆ పెద్ద నిర్మాత డబ్బు తిరిగి ఇవ్వడంలేదు. ఆయన అప్పుల్లో మునిగిపోయాడు. ఆ సంగతి ఆర్.సి.రావుకు తెలియదు. ఆ విధంగా ఆర్.సి.రావు మోసపోయాడు. దిక్కుతోచడం లేదు. తను ఆ నిర్మాతను ఏమీ చేయలేడు.మరొకవైపు మౌనికేమో డబ్బు తిరిగివ్వమని బెదిరిస్తోంది. తనకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఆమె పీడ వదిలించుకోవడానికి ఆర్.సి.రావుకి తట్టిన ఏకైక ఐడియా.. కిడ్నాఫ్, మర్డర్. అంతా చెప్పి బోరుమన్నాడు ఆర్.సి.రావు.ఐ విట్నెస్ దొరికింది. ఆర్.సి.రావుకి, అతని అనుచరులకి జైలుశిక్ష పడింది. -
వందలాది సాక్షులు అవసరమా?: సుప్రీం
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలు కేసుల విచారణలో భాగంగా లెక్కలేనంత మంది సాక్షులను ఎందుకు విచారిస్తాయోనంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు 1,500 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం దీనిపై స్పందిస్తూ ‘ప్రతి కేసులోనూ కనీసం వంద నుంచి 200 మంది సాక్షులు ఉంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ రోడ్డు ప్రమాద కేసులోనూ దాదాపు 200 మంది సాక్షులున్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షి లేరు. ఇంతమంది సాక్షులెందుకో మాకు అర్థం కాదు’ అని వ్యాఖ్యానించింది. -
సాక్షులకు రక్షణ కల్పించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: కేసుల్లో కోర్టులకు వచ్చే సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ కోణంలో సాగే కొన్ని కేసుల విషయంలోనైనా ధన బలం.. రాజకీయ అండ వున్న వారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సూచించింది. విధిలేక సాక్షులు మాటమారుస్తున్నారని.. దీంతో నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకోగలుగుతున్నారని అభిప్రాయపడింది. ఓ మహిళను క్రూరంగా హత్య చేశారన్న అభియోగం నిరూపితం కావడంతో పంజాబ్, హరియాణా హైకోర్టు నలుగురికి శిక్షలు ఖరారు చేసింది. కేసు సుప్రీంలో విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టు పైవ్యాఖ్యలు చేసింది. -
అర్దరాత్రి సాక్షులను తీసుకొచ్చిన పోలీసులు
-
’సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది’
-
నివ్వెరపరిచే వివరాలను చేప్పిన ప్రత్యక్ష సాక్షి