సాక్షులకు రక్షణ కల్పించాలి: సుప్రీం | provide protection to witnesses: Supreme | Sakshi
Sakshi News home page

సాక్షులకు రక్షణ కల్పించాలి: సుప్రీం

Nov 28 2016 1:40 AM | Updated on Sep 2 2018 5:24 PM

సాక్షులకు రక్షణ కల్పించాలి: సుప్రీం - Sakshi

సాక్షులకు రక్షణ కల్పించాలి: సుప్రీం

కేసుల్లో కోర్టులకు వచ్చే సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: కేసుల్లో కోర్టులకు వచ్చే సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ కోణంలో సాగే కొన్ని కేసుల విషయంలోనైనా ధన బలం.. రాజకీయ అండ వున్న వారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సూచించింది. విధిలేక సాక్షులు మాటమారుస్తున్నారని.. దీంతో నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకోగలుగుతున్నారని అభిప్రాయపడింది.

ఓ మహిళను క్రూరంగా హత్య చేశారన్న అభియోగం నిరూపితం కావడంతో పంజాబ్, హరియాణా హైకోర్టు నలుగురికి  శిక్షలు ఖరారు చేసింది. కేసు సుప్రీంలో విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టు పైవ్యాఖ్యలు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement