ట్రెండీగా లేటు వయసు ప్రెగ్నెన్సీ..! ఉషా వాన్స్‌, కత్రినా కైఫ్‌.. | Usha Vance pregnant at 40, Gynaecologist says about late pregnancy is it safe? | Sakshi
Sakshi News home page

40లలో ప్రెగ్నెన్సీ సరుక్షితమేనా..? ఉషా వాన్స్‌, కత్రినా కైఫ్‌..

Jan 21 2026 4:20 PM | Updated on Jan 21 2026 5:00 PM

Usha Vance pregnant at 40, Gynaecologist says about late pregnancy is it safe?

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి అమెరికా సెకండ్‌ లేడీ ఉషా వాన్స్‌ దంపతులు తాము నాలుగో బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి కూడా. అంతేగాక అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా భర్త పదవిలో ఉండగా 40 ఏళ్ల వయసులో గర్భవతి అయిన తొలి అమెరికా సెకండ్‌ లేడిగా నిలిచారామె. ఇదంతా ఎలా ఉన్నా..ఒక్కసారిగా ఇంత లేటు వయసులో గర్భధారణ మంచిదేనా అంటూ చర్చలు మొదలయ్యాయి. 

మొన్నటికి మొన్న 42 ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కత్రినా కైవ్‌. అదిమరువకమునుపే మళ్లీ భారత సంతతి మహిళ, అమెరికా ఉపాధ్యాక్షుడి సతీమణి ఉష సైతం ఆ జాబితాలో చేరిపోవడంతో..ఇక రాను ఆధునిక అమ్మల వయసు ఇలానే ఉంటుందా అంటూ ఊహగానాలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆ ఏజ్‌లో తల్లి అవ్వడం హెల్త్‌ పరంగా ప్రమాదామా కాదా? మరి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..

2014లో వివాహం చేసుకున్న ఉషా-జేడీ వాన్స్‌ దంపతులకు ఇప్పటికే ఇవాన్, వివేక్ , మిరాబెల్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు ఈ ఏడాది జూలైకి నాల్గోబిడ్డకు స్వాగతం పలకనున్నారు. అలాగే గతేడాది సెప్టెంబర్‌ 25న నటి కత్రినాకైఫ్‌ ఇలానే 42వ ఏటనే తల్లి కాబోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సరసన హాస్యనటి భారతి సింగ్‌ కూడా చేరిపోయారు. ఆమె 41వ ఏటా రెండో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు షేర​ చేసుకున్నారు. 

మొన్నమొన్నటి వరకు 30లలో గర్భధారణ ప్రమాదం అంటూ పలు వార్తలు విన్నాం. ఇప్పుడు ఏకంగా అది కూడా కాదని ఏకంగా నాలుగు పదుల వయసులో మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ ఆధునిక అమ్మలు. ఇంతకీ ఈ ఆధునిక తల్లులకు వయసు రీత్యా ఆరోగ్యప్రమాదా లేమి ఎదురుకావా? ఇకపై ఆ భయాలకు కాలం చెల్లిపోయిందా అంటే..

లేటు వయసులో ప్రెగ్నెన్సీ అనేది సురక్షితం కాదని, పలు ఆరోగ్య సమస్యలు ఉంటాయనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే సమయంలో ఇకపై ఇంత లేటు వయసులో గర్భందాల్చడం అనేది ప్రమాదకరం కూడా కాకపోవచ్చని, పైగా ఇది అసాధారణమైనదిగా ఉండదని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామంది మహిళలు తగిన జాగ్రత్తలతో సానుకూల ఫలితాలను పొందుతున్నట్లు వెల్లడించారు. 

నిజానికి ఇంత లేటు వయసులో పిల్లలను కనడం కష్టం. పైగా అండాల నాణ్యత తగ్గి..సంతానోత్పత్తి సహజంగానే తగ్గుతుందన్నారు. అందువల్ల ఆ వయసులో ఐవీఎఫ్‌ వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతలను ఆశ్రయించాల్సి ఉంటుందని కూడా అన్నారు.

తల్లి, బిడ్డకు ఎదురయ్యే ప్రమాదాలు..
వైద్య పురోగతి కారణంగా ఆలస్య గర్భధారణ సురక్షితంగా మారినప్పటికీ..35 ఏళ్లు దాటిన మహిళలు ప్రెగ్నెన్సీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు. సాధారణంగా 35 దాటిన తర్వాత గర్భధారణ అనేది మధుమేహం, రక్తపోటు, ప్రీకాంప్సియా వంటి అనారోగ్య ప్రమాదాలను పెంచుతుందట. పైగా ప్రసవ సమయంలో ఆ సమస్యల కారణంగా సీజేరియన్‌ డెలివరీ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట.

అందువల్ల ఆ ఏజ్‌లో ప్రెగ్నెంట్‌ అయ్యే మహిళలు ముందుగానే వైద్యులను సంప్రదిస్తే..రాను రాను తలెత్తే ప్రమాదాలను నివారించడంలో హెల్ప​ అవుతుందని అన్నారు. అలాగే వృద్ధ తల్లులకు జన్మించిన  శిశువులు డౌన్‌ శిండ్రోమ్‌ వంటి క్రోమోజోమ్‌ అసాధారణతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే అకాల జననం లేదా నెలలు నిండక ముందు జన్మనివ్వడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని అన్నారు.

లేటు వయసులో ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం..

  • ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందుగానే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం.

  • గర్భధారణ నిర్ధారించిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, సలహాలు, సూచనలు పాటించడం

  • సమతుల్య ఆహారం, మితకరమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం

  • ఒత్తిడి నిర్వహణ, కుటుంబ మద్దతు తదితరాలు అత్యంత అవసరం. అప్పుడే తల్లిబిడ్డ సురక్షితంగా ఉంటారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement